అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న ‘బ్రో’ టీజర్.. ఎన్ని మిలియన్స్ క్రాస్ చేసిందంటే?

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన 'బ్రో'( Bro ) టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో''.

మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ రిలీజ్ అయ్యింది.

అదిరిపోయే అంచనాలతో రిలీజ్ అవ్వగా ఆ అంచనాలను ఈ టీజర్ అందుకుంది అనే చెప్పాలి.

మరో నెల రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అని అంటున్నారు.

పవన్ క్రేజ్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. """/" / ఇక ఈ టీజర్ 24 గంటలు కూడా గడవక ముందే అప్పుడే 10 మిలియన్ వ్యూస్ అందుకుని కోటి మార్క్ ను దాటేయడంతో బ్రో కి రెస్పాన్స్ అదిరింది అనే చెప్పాలి.

ఇక నటుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటించారు.

ఈయన పాత్ర జస్ట్ అరగంట పాటు ఉంటుందని అంటున్నారు.ఆ కొద్దీ సమయం కోసం అయిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

"""/" / ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

చూడాలి ఈ రీమేక్ మూవీ ఇక్కడ ఎలా ఆకట్టు కుంటుందో.

రూ.83 లక్షలు ఆఫర్ చేసినా.. వెయిటర్ జాబ్ వదిలేయలేదు..??