వైరల్: ఆ కుక్కకి జరిపిన పుట్టినరోజు మనుషులకి కూడా జరపరు.. 100 కేజీల కేక్, 4000 వేల మందికి భోజనాలు!

ఈరోజుల్లో అంటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు కానీ, ఒకప్పుడు మనుషులకు వారి పుట్టుపూర్వోత్తరాలే తెలిసేది కాదు.కాలం మారుతున్నకొద్దీ మనిషి వేడుకలకు దగ్గరయ్యాడు.

 Viral Video Pet Dog Grand Birthday Celebrations With 100kg Cake 4000 Guests In B-TeluguStop.com

తమ జీవితంలో జరిగే ప్రతి తీపి క్షణాన్ని వేడుక చేసుకోవడం ఆరంభించాడు.అందులో భాగంగానే నేడు ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున తమ తోచినంత రీతిలో సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు.

బాగా డబ్బున్నవాళ్ళైతే ఇంకాస్త గొప్పగా జరుపుకుంటారు.అంతేగాని ఎంతో అవసరమైతే తప్ప, పెద్దగా ప్లాన్ చేసుకోరు.

అయితే ఇలాంటి తరుణంలో ఓ కుక్కకి జరిపిన పుట్టినరోజు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని బెళగావి ప్రాంతానికి చెందిన శివప్ప ఎల్లప్ప అనే వ్యక్తి ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు.

దాన్ని ప్రేమగా. ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు.

చిన్న తనం నుంచి దాన్ని అతను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.దాన్ని ఒక నిముషం కూడా వదిలి పెట్టి ఉండే వాడు కాదు.

ఈ క్రమంలో.తనకు ఇష్టమైన కుక్క బర్త్ డే సెలబ్రేషన్ లను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశాడు.

తన బంధువులను, స్నేహితులను, ఊరందరిని పిలిచాడు.అనుకున్నట్లే.

తన కుక్క కోసం వంద కేజీల భారీ కేక్ తీసుకొచ్చాడు.

తీసుకురావడమే తడవుగా అందరి ముందు తన కుక్కతో కేక్ కట్ చేయించాడు.దీనిలో పెద్ద ఎత్తున ఆ పుట్టిన రోజుకి హజరయ్యారు.ఆ తర్వాత.

పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.కాగా, శివప్ప .తన పెంపుడు కుక్క పట్ల ఉన్న ప్రేమను ఇలా చాటుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా దీన్ని చూసిన నెటిజన్లు.“ఆహా.ఏమి ఈ శునక వైభోగం” అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు “కుక్క! మరు జన్మ ఉంటే మీలాగే పుట్టాలి!” అని కోరికలు కోరుకుంటున్నారు.

కావాలంటే మీరు కూడా సదరు వీడియోని చూసి కామెంట్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube