వైరల్ వీడియో: ఒక్కసారిగా రెండేళ్ల చిన్నారిని ఎత్తి వేసిన జిరాఫీ.. చివరకు..

ప్రతిరోజు సోషల్ మీడియా( Social media )లో అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.ఇందులో ఎక్కువగా పులులు, సింహాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు ఎక్కువగా చలామణిలో ఉంటాయి.

 Viral Video: Giraffe Lifts Two-year-old Child At Once Finally , Social Media,-TeluguStop.com

అలాగే ఏనుగు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనువిందు చేస్తుంటాయి.ఇకపోతే తాజాగా జిరాఫీ చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

అమెరికాలోని టెక్సాస్ ( Texas )ప్రాంతంలో ఉన్న జాతీయ పార్కులో ప్రతిరోజు లాగానే కొందరు జంతు సఫారీకి వచ్చారు.ఈ సందర్భంగా కొందరు దారిలో వెళ్తున్న సమయంలో వారికి రోడ్డు పక్కన జిరాఫీలు కనిపించడంతో కాస్త ఆశ్చర్యంగా ఉండడంతో వారు అక్కడే ఆగి జిరాఫీ లకు ఆహారాన్ని అందించాలని భావించారు.ఈ సమయంలో కారు పైకప్పు నుండి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేశారు.

అయితే ఇదే సమయంలో ఓ జంట రెండేళ్ల చిన్నారితో ఈ సఫారీకి వెళ్లారు.తల్లిదండ్రులు జిరాఫీకి ఫుడ్ ఇస్తున్న సమయంలోనే పిల్లాడు కూడా జిరాఫీ( Giraffe )కి ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు.

అయితే ఇలా చేసే సమయంలో ఒక్కసారిగా జిరాఫీ రెండేళ్ల పిల్లాడిని అమాంతం పైకి లేపి ఒక్కసారిగా వదిలేసింది.దీంతో పిల్లాడికి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక ఈ ఘటన జరిగిన సమయంలో వారి వాహనం వెనుకలో ఉన్న మరో వాహనంలోని వ్యక్తి వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి వీక్షించండి.ఏదేమైనా బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చిన్నారులను కాస్త జాగ్రత్తగా చూసుకోవడం తప్పనిసరి.లేకపోతే ఒకోసారి ప్రాణాల మీదకు కూడా రావొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube