ప్రఖ్యాత నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు.
ప్రస్తుతం టాలీవుడ్ లో గొప్ప నటులుగా కీర్తించబడుతున్న ఎంతో మందిని తెరకి పరిచయం చేశారు.ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలని నిర్మించారు.
విజయా సంస్థ అంటే ఒకప్పుడు బ్రాండ్ అని చెప్పాలి.ఆ సంస్థ నుంచి చందమామ, బొమ్మరిల్లు, విజయ వంటి మ్యాగజైన్స్ కూడా వస్తూ ఉన్నాయి.
ఒకప్పుడు చందమామ పుస్తకం అంటే భాగా పాపులర్.తాత స్థాపించిన వాటిని విజయవంతంగా నడుపుతున్న అతని మనవడు శరత్ రెడ్డి చెన్నైలో కరోనా వైరస్‌తో కన్నుమూశారు.
నాగిరెడ్డికి ఇద్దరు కొడుకుల్లో ఒకరు విశ్వనాథరెడ్డి.ఈయనకు ఇద్దరు కొడుకులు.వారిలో రెండో కొడుకు శరత్ రెడ్డికి కరోనా వైరస్ సోకడంతో ఇటీవల చెన్నైలోని విజయా హెల్త్ హాస్పిటల్‌లో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు.
శరత్ రెడ్డి చందమామ, విజయ, బొమ్మరిల్లు మ్యాగజైన్ ల నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు.శరత్‌రెడ్డి మరణంతో బి.నాగిరెడ్డి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆయన కరోనాతో మరణించడంతో ఇప్పుడు కుటుంబం మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.