రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'వర్మ మన ఖర్మ ' పుస్తకం..!

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏదో ఒక విషయంపై ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న సంగతి మనం గమనిస్తూనే ఉంటాం.

 'verma Mana Kharma' Book Ready For Release ..!-TeluguStop.com

తాజాగా ఆయనపై ఒక పుస్తకం విడుదల కాబోతుంది.ఈ పుస్తకం పేరు ‘వర్మ మన ఖర్మ’.

పేరు వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంది కదా.అవునండి, ఈ పేరుమీద పుస్తకం విడుదల కాబోతుంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

పర్వతాల రేఖ అనే యువతి రాసిన ఈ పుస్తకాన్ని నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంచు లక్ష్మితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు.

ఇక ఈ పుస్తక విడుదల సందర్బంగా వర్మని ఎవరు డిఫైన్ చేస్తారు అంటూ రచయిత్రి అడుగుతోంది.ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏం మనిషినైనా డిఫైన్ చేయగలం కానీ.

రామ్ గోపాల్ వర్మ ను డిఫైన్ చేయమని అడిగితే ఈ మనిషి ఇది అని ఎవరు డిఫైన్ చేయలేరు అని ఆవిడ చెబుతోంది.అయితే ఇందుకు గల కారణం రామ్ గోపాల్ వర్మ ఒక జ్ఞాని అన్న పిచ్చోడన్న, తెలివైనవాడన్న ఇంకా ఏదన్నా సరే అది కేవలం ఆ సమయానికి మాత్రమే అని అతను ఇది అని చెప్పడం మాత్రం చాలా కష్టమైన పని అని అంటోంది రచయిత్రి.

దీంతో రచయిత్రి రాం గోపాల్ వర్మ డెఫినేషన్ కు అందని వ్యక్తిగా మాటలకు దొరకని వ్యక్తిగా అభివర్ణించింది.ఎవరు డిఫైన్ చేయలేదు అని చెబుతూనే ఆవిడ డిఫైన్ చేయడానికి ఈ పుస్తకం రాసింది అని అర్థమవుతోంది.

ఇకపోతే లాక్ డౌన్ సమయం నుండి రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అనేక చిక్కులలో పడుతున్నాడు.ఇదివరకు మొదట్లో మర్డర్ సినిమాకు సంబంధించి కోర్టులో కేసు జరగగా చివరికి సినిమాను రిలీజ్ చేసుకోవచ్చునని కోర్టు ఆదేశించింది.

ఆ తర్వాత మళ్లీ దిశ కేసుకు సంబంధించి ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఆ సినిమాకు ఎన్ కౌంటర్ అనే టైటిల్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా కూడా ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

అంతేకాదు ఆయనపై ఆయన రాము అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube