వరుణ్ 'VT12' షూట్ స్టార్ట్.. ప్రవీణ్ సత్తారు ఈసారైనా హిట్ ఇస్తాడా?

ప్రవీణ్ సత్తారు.ఇప్పుడు ఇతడు డైరెక్టర్ గా బిజీగా ఉన్నాడు.

 Varun Tej And Praveen Sattarus Film 2-TeluguStop.com

మంచి జాబ్ లైఫ్ వదిలేసి తన ఫ్యాషన్ కోసం ఇక్కడికి వచ్చి డైరెక్టర్ గా మారిపోయాడు.ప్రవీణ్ సత్తారు రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్ అనే సినిమాలను తెరకెక్కించాడు.

కానీ ఈ సినిమాలు ఏవీ కూడా ఈయనకు స్టార్ డమ్ ఇవ్వలేదు.ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన గరుడవేగ హిట్ అవ్వడంతో ఈయనకు మంచి పేరు వచ్చింది.

దీంతో నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.నాగార్జునతో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కించాడు ప్రవీణ్ సత్తారు.

ఈ యాక్షన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.అలాగే ఓపెనింగ్స్ కూడా దారుణంగా రావడంతో ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా మారి పోయింది.

ఇప్పుడు పరిస్థితి చుస్తే భారీ నష్టాలు వచ్చేలా ఉంది.

ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంది.కానీ ఇంతలోనే ఘోస్ట్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమా ఆగిపోతుంది అనే వార్తలు తెరపైకి వచ్చాయి.

కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా షూట్ తాజాగా స్టార్ట్ అయినట్టు అఫిషియల్ గా వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

Telugu Praveen Sattaru, Nagarjuna, Ghost, Tollywood, Varun Tej-Latest News - Tel

VT12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా లండన్ లో షూట్ స్టార్ట్ అయినట్టు వరుణ్ చెప్పడంతో ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది.చిన్న వీడియో రిలీజ్ చేస్తూ ఈ అప్డేట్ చెప్పడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీసీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube