ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి.వారిలో ముగ్గురు హీరోలైన తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు.
వారు హీరోగా వస్తున్న సినిమాల పేర్లు గేమ్ ఛేంజర్, పుష్ప పార్ట్ 2, దేవర.అయితే ఈ సినిమాలపై నెగిటివిటీ అనేది భారీ ఎత్తున పెరిగిపోయింది.
అందువల్ల ఈ హీరోలు వణికిపోతున్నారు.
గేమ్ చేంజర్
![Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood- Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/09/movie-Pushpa-2-devara-tollywood-ram-charn-S.-Shankar-allu-arjun-Game-Changer.jpg)
S.శంకర్(S.Shankar ) దర్శకత్వంలో రూ.450 కోట్లతో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై నెగిటివిటీ నెలకొన్నది.శంకర్ తీసిన భారతీయుడు 2 సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీ చాలా బోరింగ్, అవుటేటెడ్ కథతో వచ్చింది.కమల్ హాసన్ ఎంట్రీ కూడా బోర్ కొట్టించింది.అంతకుముందు శంకర్ తీసిన సినిమాలు కూడా ఇంతే ఫ్లాప్ అయ్యాయి.
దీనివల్ల శంకర్ రామ్ చరణ్ తో కలిసి తీస్తున్న సినిమా బాగుంటుందా అనే కోణంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ మూవీ కూడా పోయినట్లే అని చాలామంది ఆల్రెడీ నెగిటివ్ టాక్ మొదలుపెట్టారు.
మరోవైపు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అందుకోవడం అందరికీ సర్వసాధారణం అయిపోయింది.రామ్ చరణ్ కి అదే జరుగుతుందని కొందరు భావిస్తున్నారు.
చెర్రీ ఈ మూవీపై బాగా ఆశలు పెట్టుకున్నాడు.ఇది ఫ్లాప్ అయితే మాత్రం ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది.
అందుకే చరణ్ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇది డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
దేవర
![Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood- Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/09/devara-tollywood-ram-charn-S.-Shankar.jpg)
కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్టోరియల్ దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది.ఈ యాక్షన్ డ్రామా చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతున్న వేళ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు.అందులో భాగంగా ట్రైలర్ వదిలారు.
అయితే ఇందులో సీన్లు చాలా డార్క్ గా, మసక మసకగా ఏమీ కనిపించకుండా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ చాలా వరస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు.
R.రత్నవేలు దీనికి సినిమాటోగ్రాఫర్.ఆయన పనితనం గొప్పగానే ఉంటుంది.కానీ దర్శకులు చెప్పినట్లే సినిమాటోగ్రఫీ అందిస్తారు.అయితే దేవర సినిమాలో సన్నివేశాలు చక్కగా కనిపించడం లేదు.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు.
మూవీ టీమ్ మొత్తం బాగానే కష్టపడింది కానీ సన్నివేశాల కలర్స్ విషయంలో తప్పు చేసినట్టుగా తెలుస్తోంది.గ్రాఫిక్స్ కూడా అంత బాగా లేదంటున్నారు.అందువల్ల దీనిపై నెగిటివిటీ వచ్చింది.
•
పుష్ప: ది రూల్
![Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood- Telugu Allu Arjun, Devara, Game Changer, Pushpa, Ram Charn, Sshankar, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/09/pushpa-the-rule.jpg)
పుష్ప: ది రైజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే పుష్ప: ది రూల్ సినిమా దగ్గరికి వచ్చేసరికి అల్లు అర్జన్పై చాలా నెగెటివిటీ వచ్చింది.ఆయన పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
నాగబాబు కూడా బన్నీని గెలుక్కున్నాడు.ఇటీవల ఇంద్ర సినిమా రిలీజైన సంగతి తెలిసిందే అందులో శివాజీ క్యారెక్టర్ చిరంజీవి కి వెన్నుపోటు పొడుస్తాడు ఆ క్యారెక్టర్ తో బన్నీని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు.
మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి పుష్ప పార్ట్ 2 సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు వీరి వల్ల న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా బన్నీ పై నెగెటివిటీని పెంచుకుంటున్నారు.ఇది గమనించిన సుకుమార్ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాల్సిన తన సినిమాని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసుకున్నారు.
అయితే ఇవన్నీ మాత్రం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఎవరు ఎలాంటి నెగటివ్ ప్రచారం చేసినా జరిగే నష్టమేమీ లేదని ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.