పవన్ ఉత్తరాంధ్ర టూర్ ! వైసీపీ సభకు పోటీగానేనా ? 

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం అమరావతి,  మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి.

 Pawan Uttarandhra Tour! Is It A Competition For Ycp Pavan Kalyan, Telugudesam,-TeluguStop.com

అమరావతి టు అరసవల్లి పేరుతో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల మద్దతుతో అమరావతి పరిసర ప్రాంత రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు,  మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే వారిని అడ్డుకునేందుకు పోటీగా ఆందోళనలు చేపట్టేందుకు వైసిపి అనేక వ్యూహాలు రూపొందించుకుంది.

      ఈ వ్యవహారం తిప్పుకొట్టేందుకు టిడిపి సిద్ధమవుతుండగా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా అదే సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.ఈనెల 15, 16, 17వ తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొనబోతున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ప్రజలతో పవన్ సమావేశం అవుతారని, వారి సమస్యలను స్వీకరిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.ఇది ఇలా ఉంటే.

ఈనెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు భారీగా జన సందోహం హాజరయ్యేలా వైసీపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.   

Telugu Amaravathi, Ap Cm Jagan, Ap, Jagan, Janasenani, Pavan Kalyan, Telugudesam

  అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహ పాదయత్ర కూడా విశాఖకు చేరుకోబోతోంది.ఈ క్రమంలోనే పవన్ జన వాణి  నిర్వహిస్తుండడంతో విశాఖ లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.ఇదిలా ఉంటే జనసేన, టీడీపీ ల వ్యూహాలను తిప్పికొట్టే విధంగా వైసీపీ పగడ్బందిగా ఏర్పాట్లు చేసుకుంటోంది.దీంతో మూడు రాజధానులు , అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తత పెంచేలా కనిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో నే ఆయన దట్టపుత్రుడు పవన్ విశాఖలో వైసీపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు అనే విమర్శలు వైసీపీ నాయకులు మొదలుపెట్టారు.   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube