కొరటాల శివ ( Koratala Shiva )డైరెక్ట్ చేసిన “దేవర: పార్ట్ 1” సినిమా( Devara: Part 1″ movie ) సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుంది.ఈ యాక్షన్ డ్రామా మూవీలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా ఇది.దీనిపై అంచనాలు వేరే రేంజ్ లో ఉన్నాయి.2022లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయింది.అప్పటినుంచి రెండు ఏళ్ల పాటు తారక్ దేవర సినిమా కోసమే టైమ్ స్పెండ్ చేశాడు.ఇందులో దేవరాజు అలియాస్ “దేవర”, వరద అలియాస్ “వర”గా కనిపించనున్నాడు.

ఈ సినిమాలో చాలా భాగం కంప్యూటర్ గ్రాఫిక్స్ (VFX) మీద ఆధారపడి ఉంది.అందుకే తారక్ బ్రదర్ కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఈ VFX లను మరింత అద్భుతంగా చూపించడానికి ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డాడు.ఏ సన్నివేశాన్ని నిజంగా చిత్రీకరించాలి, ఏ సన్నివేశానికి VFX అవసరం అనేది ఆయన స్వయంగా నిర్ణయించాడు.VFX అవసరమైన సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించారు.తర్వాత ఆ నాలుగు నెలల పాటు ఆ VFX పనులు చేశారు.ఈ పనులన్నీ ఇంటర్నేషనల్ కంపెనీల సహాయంతో జరిగాయి.
ఈ సినిమా డబ్బింగ్ పనులు 2024,జులైలోనే మొదలయ్యాయి.ఈ సినిమాను మొదట 2024 ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు.
కానీ VFX పనులు ఎక్కువగా ఉండటం వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు.తర్వాత మళ్ళీ విడుదల తేదీని మార్చారు.
ఇలా రెండేళ్ల సమయం తీసుకుంది అయితే పార్ట్-2 కూడా సేమ్ ఇంతే టైం తీసుకుంటుందని పలువురు భావిస్తున్నారు.ఎందుకంటే ఎన్టీఆర్ ఆల్రెడీ వేరే సినిమాలు కి కమిట్ అయ్యాడు వాటిని పూర్తి చేసిన తర్వాతే ఆయన మళ్లీ ఈ మూవీ రెండో భాగం షూటింగ్‌లో చేరే అవకాశం ఉంది.

వార్ 2( War 2 ) సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.ఇది ఎన్టీఆర్‌కు మొట్టమొదటి హిందీ మూవీ కావడం విశేషం.ఇది 2025లో విడుదలవుతుంది.తర్వాత ఎన్టీఆర్, నీల్ కలిసి ఒక సినిమా కంప్లీట్ చేస్తారు.ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాతే దేవర పార్టు 2 మూవీ వస్తుంది.
ఆల్రెడీ కొన్ని ప్రారంభ సన్నివేశాలు తీసినట్లున్నారు.ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
అయినా సరే దానిని అలాగే ఉంచుతారు.మొత్తం మీద నాలుగున్నర సంవత్సరాలు ఇది సినిమా సిరీస్ పూర్తిగా చూడడానికి ప్రేక్షకులకు సమయం పడుతుంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేట్ అయిన పర్లేదు కానీ ఇంత వెయిట్ చేయించినందుకు మంచి మూవీ తీస్తే బాగుంటుంది అని పేర్కొంటున్నారు.