టాలీవుడ్, కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్( varalakshmi sarathkumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగటివ్ పాత్రలతో అందర్నీ తనవైపుకు మలుపుకుంది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ విలన్ పాత్రకు ఈమెను మించిన వాళ్లు లేరని చెప్పాలి.తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ ముద్దుల కూతురే వరలక్ష్మి.
శరత్ కుమార్ మొదటి భార్య ఛాయకు వరలక్ష్మి పుట్టింది.ఇక శరత్ కుమార్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా రాధిక( Radhika ) ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు శరత్ కుమార్ రెండవ భార్యగా రాధిక ఉంది.ఇక రాధిక వరలక్ష్మిని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది.
ఇక వరలక్ష్మి తండ్రి సపోర్టుతో నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.ఇక వీరసింహారెడ్డి( Veera Simha Reddy ) సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన మరిన్ని సినిమాలలో కూడా నెగిటివ్ పాత్రలో నటించింది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.ముఖ్యంగా తన డాన్స్ వీడియోలతో బాగా ఫిదా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.
ఇక సవతి తల్లి అయిన రాధికతో చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉంటుంది.తనతో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. నిజానికి ఏ సవతి తల్లి అయినా ఇలా సవతి పిల్లలను చూసుకోదు.కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధమని చెప్పాలి.రాధిక వరలక్ష్మిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది.చూసే వాళ్లకు కూడా వీరిద్దరు చాలా చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటారు.
అయితే వరలక్ష్మి రాధికను అమ్మ అని పిలుస్తుందా లేక పిన్ని అని పిలుస్తుందా అనేది ఎవరికి ఇప్పటివరకు తెలియలేదు.కానీ తాజాగా ఆమె షేర్ చేసిన పోస్టులు చూసినట్లయితే తను రాధికను ఏం పిలుస్తుందో తెలిసిపోయింది.ఈరోజు రాధిక పుట్టిన రోజు సందర్భంగా తనతో దిగిన ఫొటోస్ పంచుకుంటూ హ్యాపీ బర్త్డే ఆంటీ అని తనకు బర్త్ డే విష్ చేసింది.దీంతో తను సవతి తల్లి రాధికను అమ్మ అని కాకుండా పిన్ని అని కాకుండా ఆంటీ అని పిలుస్తుందని క్లారిటీ వచ్చేసింది.
అయితే జనాలు.తను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది కాబట్టి అమ్మ అంటే సరిపోతుంది కదా అని.అమ్మ అనే పిలుపు వినడానికి మాకే కాదు మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా అని కోరుకుంటున్నారు.