ఫోన్ బ్యాటరీని బాగా తగ్గించే యాప్స్ ఇవే.. వెంటనే డిలీట్ చేసుకోండి..

మన ఫోన్‌లో అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం.మన అవసరానికి తగ్గట్లు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం.

 These Are The Apps That Reduce The Battery Of The Phone Delete It Immediately ,-TeluguStop.com

కొన్ని యాప్స్ ఫోన్‌తో పాటు డీఫాల్ట్‌గా వస్తూ ఉంటాయి.ఆ యాప్ లను అవసరం లేనప్పుడు మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చు.

అయితే కొంతమంది అవసరం లేకపోయినా ఫోన్‌లో కొన్ని యాప్‌లను ఉంచుకుంటూ ఉంటారు.ఏదైనా అవసరం కోసం యాప్స్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటారు.

ఒకసారి అవసరం అయిపోయిన తర్వాత కూడా అనవసరంగా యాప్‌లను అలాగే ఫోన్‌లో ఉంచుకుంటూ ఉంటారు.

అయితే అనవసరమైన యాప్‌లను ఫోన్‌లో ఉంచుకోవడం వల్ల బ్యాటరీ వెంటనే తగ్గిపోయే అవకాశం ఉండటంతో పాటు స్టోరేజ్ కూడా ఎక్కువైపోతుంది.దీని వల్ల ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది.ఫోన్ బ్యాటరీని జలగల్లా పీల్చేసే 43 యాప్‌లను( 43 apps ) తాజాగా గూగుల్ గుర్తించి ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

ఆ యాప్‌ల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

43 యాప్‌లు యూజర్ల అనుమతి లేకుండా ఫోన్ బ్యాటరీ, డేటాను( Phone battery, data ) పీల్చుకుంటున్నట్లు గూగుల్ గుర్తించింది.మెకాఫీ భద్రతా బృందం వీటిని గుర్తించి ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది.మ్యూజిక్ డౌన్‌లోడర్ క్యాలెండర్టీవీ, ప్లేయర్, న్యూస్ వంటి కొన్ని యాప్ లను తొలగించింది.

ఈ యాప్‌లను ఉపయోగించకపోయినా ఫోన్ బ్యాటరీ, బ్యాటరీ అయిపోతున్నట్లు గూగుల్ గుర్తించింది.ఇలాంటి యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని ఫోన్ నుంచి వెంటనే తొలగించాలని గూగుల్ సూచించింది.

యూజర్లకు తెలియకుండానే లాక్ అయిన ఫోన్ లో కూడా ఆ యాప్ లు రన్ అవుతూ ఉంటాయి.దీంతో ఛార్జింగ్, డేటా వెంటనే అయిపోతుంది.ఇలాంటి అనుమానాస్పద యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తించి డిలీట్ చేస్తూ ఉంటుంది.అందులో భాగంగా ఇటీవల ఈ యాప్‌లను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

These Apps Drain Your Phone's Battery the Most

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube