సినిమా ఇండస్ట్రీలో ఆత్మ ప్రేతాత్మలతో( Horror Movies ) కూడిన కథలతో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే.అందులో కొన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.
మరికొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాయి.అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆత్మ ప్రేతాత్మలతో కూడిన కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.
ఇలా ఆత్మ ప్రేతాత్మలతో కూడిన మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి.ఆ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించిన చిత్రం అరుణ్ మనై 3.( Aranmanai 3 )
సుందర్ సి కీలకపాత్రలో నటించి, దర్శకత్వం వహించిన అరుణ్ మనై సినిమా ఇప్పటికే మూడు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే.మూడు భాగాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ప్రస్తుతం నాలుగో భాగం నిర్మాణ దశలో ఉంది.
ఇందులో ఆర్య హీరోగా నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ తమన్నా కూడా నటించనుంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.టాలీవుడ్ హీరోయిన్ సమంత, ఆయుష్మాన్ ఖురానా కలిసి ఒక హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్( Vampires Of Vijaynagar ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.హర్రర్ కామెడీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.హర్రర్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ సినిమాలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది.
సినిమాకు వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో కావ్య తాపర్, వర్షా బొల్లమ్మ కథానాయకులుగా నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.