మెగా కోడలు ఉపాసన ( Upasana ) బిజినెస్ ఉమెన్ గాను గృహిణిగా, కోడలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఈమె తన వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న తనకు తన ఫ్యామిలీకి ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటారు.
ఇకపోతే ఉపాసన ఇటీవల తన అత్తయ్య పేరు మీదుగా అత్తమ్మ కిచెన్స్ అంటూ సరికొత్త ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే పిల్ల అత్తమ్మ కిచెన్ ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలను మనం పొందవచ్చు.అయితే ఈ ఆహార పదార్థాలన్నింటిని కూడా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ( Surekha ) పర్యవేక్షణలో తయారు అయ్యి మనకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇలా తన అత్తయ్య చేత ఉపాసన సరికొత్త బిజినెస్ ప్రారంభించారు.ఈ బిజినెస్ ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది.ఇక ఇటీవల కాలంలో ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఈమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో అంజనమ్మ ( Anjanamma ) ఒకచోట కూర్చుని ఉండగా ఉపాసన అక్కడికి వెళ్లి నాయనమ్మ ఏం చేస్తున్నారు అని అడగగా ఏం పని లేక ఇలా కూర్చుని చూస్తున్నాను అంటూ సమాధానం చెప్పారు.
ఏంటి నాయనమ్మ మీ కోడలు సరిగా చేయలేదా పికెల్ అంటూ అడగగా సరిగా చేయకపోతే నువ్వు ఉన్నావు కదా నువ్వు కోడలివే కదా అంటూ అంజనమ్మ సేటైర్స్ వేస్తుంది.మరోవైపు సురేఖ మామిడికాయ ఊరగాయ ( Mango Pickle ) పెడుతూ ఉండగా ఉపాసన అక్కడికి వెళ్లి అత్తమ్మ క్యా హో రహా అని అంటుంటే.సురేఖ మాత్రం సమాధానం చెప్పకుండా తన పనిలో తాను మునిగిపోయారు.కానీ అంజనమ్మ మాత్రం రిప్లై ఇచ్చారు.హిందీలో అడిగితే అస్సలు సమాధానం చెప్పలేదన్నట్టుగా అనేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.