'తుపాకి రాముడు' రివ్యూ

బిత్తిర సత్తి.ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Tupaki Ramudu Movie Review-TeluguStop.com

చిన్నా పెద్దా ముసలి ముతకా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు బిత్తిరి సత్తి.చేవెల్ల రవి అంటే ఒక్కరు ఇద్దరికి కూడా తెలియదు.

కాని బిత్తిరి సత్తి అంటే మాత్రం అందరికి తెలుసు.అంతటి గుర్తింపును దక్కించుకున్న చేవెల్ల రవి అలియాస్‌ బిత్తిరి సత్తి హీరోగా ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రేక్షకులను బుల్లి తెర ద్వారా ఎంటర్‌టైన్‌ చేస్తున్న రవి ఇప్పుడు వెండి తెరపై తుపాకి రాముడు చిత్రంతో వచ్చాడు.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ : తుపాకి రాముడు(బిత్తిరి సత్తి) తన వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు.అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అతడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది.

ఆమె ఎంట్రీతో అతడి జీవితం మొత్తం అతలాకుతలం అవుతుంది.ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? ఆమె వల్ల తుపాకి రాముడు పడ్డ కష్టం ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన : బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌లో అదరగొట్టాడు.

కాని కొన్ని యాక్షన్‌ సీన్స్‌ మరియు ఎమోషనల్‌ సీన్స్‌లో సత్తి ఇంకాస్త బెటర్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాల్సి ఉంది.మొత్తంగా పర్వాలేదు అనిపించింది.

పాటల్లో డాన్స్‌లతో కూడా బిత్తిరోడు దుమ్ము రేపాడు.హీరోయిన్‌గా నటించిన ప్రియ అచ్చ తెలుగమ్మాయి అవ్వడంతో చూడ్డానికి అందంగా ఆకట్టుకుంది.

నటన పరంగా కూడా ఆమె మెప్పించింది.ఇక సినిమాలో కనిపించిన రసమయి కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.

ఇతర నటీనటులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ : ఈ సినిమాకు టి ప్రభాకర్‌ దర్శకత్వం వహించాడు.ఈయన పూర్తిగా తెలంగాణ యాస, తెలంగాణ ప్రాంతాన్నే ఎంపిక చేసుకున్నాడు.ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు.అయితే కొన్ని సీన్స్‌లో బిత్తిరి సత్తి నుండి ఇంకాస్త బెటర్‌ ఔట్‌ పుట్‌ రాబట్టి ఉంటే బాగుండేది.ఇక స్క్రీన్‌ప్లే విషయంలో అక్కడక్కడ గందరగోళం అనిపించినా మొత్తానికి పర్వాలేదు.

ఈయనే ఈ సినిమాకు సంగీతాన్ని కూడా అందించాడు.తెలంగాణ పల్లె పదాలను ఈ సినిమాలో ఎక్కువగా వినియోగించాడు.

అవి గతంలోనే సక్సెస్‌ అయ్యాయి.ఇప్పుడు ఈ సినిమాలో ఆకట్టుకున్నాయి.

బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది.తెలంగాణ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్‌ చక్కగా చూపించాడు.

క్వాలిటీ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది.నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు.

ఎడిటింగ్‌లో అక్కడక్కడ లోపాలున్నాయి.

విశ్లేషణ : బిత్తిరి సత్తి సినిమా అంటే ఖచ్చితంగా అందరు అంచనాలు పెట్టుకున్నారు.తప్పకుండా ఇదో మంచి సినిమాగా ఉంటుందని భావించారు.అంచనాలకు కాస్త దూరంలో ఈ చిత్రం ఉంది.స్టోరీ లైన్‌ విభిన్నంగా ఉన్నా దాన్ని పూర్తి స్థాయి కథగా మల్చడంతో పాటు దాన్ని చూపించిన స్క్రీన్‌ప్లే కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది.ప్రేక్షకులు బిత్తిరి సత్తి నుండి ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ను ఆశించారు.

అలాంటి వారికి అక్కడక్కడ బిత్తిరోడు ఎమోషనల్‌ అవ్వడం నచ్చలేదు.కాని సినిమా అన్నప్పుడు అన్ని ఉండాలి.

అవి లేకుండా సినిమా చేయడం కష్టం.అందుకే దర్శకుడు ఈ సినిమాను అన్ని విధాలుగా చూపించే ప్రయత్నం చేశాడు.

మొత్తానికి బిత్తిరి సత్తికి హీరోగా కూడా స్కోప్‌ ఉందని ఈ సినిమాతో నిరూపితం అయ్యింది.బిత్తిరోడిని అభిమానించే వారు తప్పకుండా సినిమా చూసే విధంగా ఉంది.

ప్లస్‌పాయింట్స్‌ : బిత్తిరి సత్తి, కామెడీ సీన్స్‌, పాటలు

మైనస్‌ పాయింట్స్‌ : స్క్రీన్‌ప్లే, కథ, ఎడిటింగ్‌

బోటమ్‌ లైన్‌ : బిత్తిరోడి షో బాగుంది.

రేటింగ్‌ : 2.75/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube