చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్లీ తిరిగి రావడమే ట్విస్ట్ అనుకుంటే మరో ట్విస్ట్ తూర్పుగోదావరి జిల్లా( East Godavari District ) రంగంపేటలో చోటుచేసుకుంది.వీరంపాలెం నకు చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య వ్యాపారంలో అప్పుల పాలవ్వడంతో 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ప్లాన్ వేశాడు.
ముగ్గురు వ్యక్తులకు పదివేల రూపాయలు ఇచ్చి రాజమండ్రి ( Rajamahendravaram )రూరల్ బొమ్మూరులోని క్రైస్తవ స్మశాన వాటిక నుంచి ఈనెల 25న మృతదేహాన్ని చోరీ చేయించాడు.ఆ మర్నాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి దొంగిలించిన మృతదేహాన్ని తగలబెట్టించాడు.
చనిపోయింది తానే అని నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే తన ప్లాన్ ని మధ్యలోనే విరమించి ఇంటికి వచ్చేసాడు.
దీంతో వ్యవహారం కాస్త సంచలంగా మారడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతదేహాన్ని దొంగలించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు పూసయ్య ( Pusayya )సహా సహకరించిన నలుగురిని ఇవాళ అరెస్టు చేసినట్టు రాజమండ్రి ఈస్ట్ జోన్ డిఎస్పి కిషోర్ కుమార్ తెలిపారు.