సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఏదో ఒక రకంగా హిట్టు కొడుతూ కెరియర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు.కొంత మంది పెద్ద తెరపై తమ జోరు చూపిస్తే మరి కొంత మంది ఓటిటి ద్వారా తమ సత్తా చాటుకుంటున్నారు.
కానీ కొంతమంది హీరోలు మాత్రం సినిమాలు తీయలేక తీసిన సినిమాలు విజయాలు సాధించలేక ఇబ్బందులు పడుతూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఐరన్ లెగ్స్ గా మారిపోయారు.మరి అంత దారుణమైన పరాజయాలు మూట కట్టుకుంటూ ముందుకు వెళ్లలేకపోతున్న ఆ హీరోలు ఎవరు అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ విషయం లో ఖచ్చితంగా ముందు చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజ్ తరుణ్( Raj Tarun ).కెరియర్ ప్రారంభంలో మూడు వరుస హిట్లు కొట్టి ఫుల్ జోష్ లో అనేక సినిమాల కథలు విని స్టార్ హీరోలకు దీటుగా చిత్రాలు చేశాడు.కానీ కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఆ తర్వాత విజయాన్ని కూడా పరాజయం పాలయ్యాయి.దాంతో ఇప్పుడు అతనితో సినిమా తీయడానికి ఎవరు ముందుకు రావడం లేదు.
స్టాండప్ రాహుల్( Stand Up Rahul ) తర్వాత ఆయన సినిమా వచ్చింది కూడా లేదు ఒక సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చినా కూడా అదేమీ రాజ్ తరుణ్ కెరీర్ కి ఉపయోగపడలేదు.దాదాపు ఏడాదికి పైగా అతని సినిమాలు అన్నీ ఆగిపోయాయనే చెప్పాలి.
ఇక ఇదే దోవలో పొరపాట్లు చేస్తూ అగచాట్లు పడుతున్న మరొక హీరో ఆది సాయి కుమార్( Aadi Saikumar ).2023లో ఐదు సినిమాలు మొదలెట్టిన కేవలం CSI సనాతన్ ( CSI Sanatan )మాత్రమే విడుదల అయింది మిగతా సినిమాలన్నీ కూడా ప్రొడక్షన్ జరుపుకోవాడానికి ఇబ్బందులు పడుతున్నాయి.ఇతడితో సినిమా చేయాలంటే డైరెక్టర్ భయపడుతున్నారు నిర్మాతలు పారిపోతున్నారు.ఇక ఇప్పుడు ఆది సాయికుమార్ కెరియర్ కూడా ప్రమాదంలో పడింది మొదట్లో ఏ చిన్న సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని డిజాస్టర్ తో సంబంధం లేకుండా మళ్ళి సినిమాలో చేస్తూ వచ్చిన ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.