సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం.మరి ఆ గ్లామర్ కాపాడుకోవాలంటే చాలా కఠినమైన డైట్ మైంటైన్ చేయాలి.
చక్కటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆహారం తీసుకోవాలి.పాలు, పళ్లతో పాటు మాంసం కూడా సరైన పాళ్ళలో తీసుకుంటేనే మంచి శరీరాకృతి కలిగి ఉంటారు.
మరి కొంత మంది సెలబ్రిటీస్ మాత్రం ఇలాంటి విషయాలను పట్టించుకోరు.ఎందుకంటే సౌత్ ఇండియన్ పరిశ్రమలో చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు.
అందుకు గల కారణం వారంతా ఆనిమల్ లవర్స్ కావడం కూడా ఒక కారణం.మరి మన సౌత్ పరిశ్రమలో వెజిటేరియన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
ధనుష్
తమిళ సూపర్ స్టార్ ధనుష్ ప్యూర్ వెజిటేరియన్.ఇతడికి ఇడ్లీ, దోస మరియు సాంబార్ అంటే మహా ఇష్టం.
శ్రియ శరన్
హాట్ యాక్ట్రెస్ శ్రియ శరన్ కూడా తన డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉండటం తో పాటు ఆమె పూర్తి శాకాహారి.ఆమె హోమ్ ఫుడ్ మాత్రమే తిండడానికి ఇష్టపడుతుంది.ఇక తన ఆరోగ్యానికి, అందానికి రహస్యం కారణం నాచురల్ హోమ్ ఫుడ్ అని చెప్తుంది శ్రియ
త్రిష కృష్ణన్
సౌత్ ఇండియాలో పదిహేను ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సైతం ప్యూర్ వెజిటేరియన్.ఇక ఈమె ఆర్గానిక్ ఫుడ్ ని బాగా ఇష్టపడుతుంది.అంతే కాదు ఆమెకు ఇష్టమైన ఆహారం ఊతప్పం మరియు సాంబార్.
జెనీలియా
జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ ఇద్దరు కూడా కొన్నేళ్ల క్రితం పూర్తి శాకాహారులుగా మారిపోయారు.అంతే కాదు తన భర్త ఆరోగ్యం విషయంలో జెనీలియా అసలు కాంప్రమైజ్ కాదు అని అంటూ ఉంటారు.రితేష్ కి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే జెనీలియా ఇలా స్ట్రిక్ట్ వెజిటేరియన్ గా మారిపోయిందని సమాచారం.
తమన్నా
తమన్నా ఒకప్పుడు మంచి నాన్ వెజిటేరియన్.ఆమెకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కానీ కొన్నాళ్ల క్రితం ఆమె పూర్తిగా శాకాహారిగా మారిపోయింది.
మాధవన్
మాధవన్ చిన్ననాటి నుంచి శాకాహారి.తాను ఎల్లప్పుడూ కూరగాయలను ప్రేమిస్తాడు అంతే కాదు ఆర్గానిక్ ఫాన్స్ ని కూడా పెంచుతున్నాడు.
సూర్య
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సూర్య చాలా స్ట్రిక్ట్ గా వెజిటేరియన్ ఫుడ్ ని ఫాలో అవుతాడు.అంతే కాదు థన్ ఫిజిక్ సీక్రెట్ కూడా అదే అని చెప్తున్నాడు సూర్య.
ఇక అమల పాల్, అలియా భట్ వంటి చాలా మంది హీరోయిన్స్ కూడా ఆనిమల్ లవర్స్ గా ఉంటూ జీవ హింస చేయడానికి ఇష్టపడటం లేదు.