ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతూనే ఉంది.ప్రస్తుత జీవనశైలి ఆహారపు అలవాట్లు పని ఒత్తిడి డయాబెటిస్ కు ప్రధానమైన కారణాలు.
ఈ క్రమంలో మిఠాయిలు పంచదార ను పూర్తిగా మానేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.మధుమోహo వ్యాధి నియంత్రణకు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఆహారపు అలవాట్లను జీవన విధానాన్ని కచ్చితంగా మార్చుకోవాలి.ప్రతిరోజు ఉదయం వ్యాయామం కచ్చితంగా చేయాలి.
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు పంచదారతో చేసిన మిఠాయిలు పూర్తిగా మానేయడం మంచిది.ఇలా చేయకపోతే ఆరోగ్యం పై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పంచదారను పూర్తిగా మానేయడం వల్ల చెడు ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం.పంచదార అనేది రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి సహజసిద్ధంగా ఉండేది.రెండవది ప్రోసెస్డ్ పంచదార.
సహజ సిద్ధంగా ఉండే పంచదార మామిడి, పైనాపిల్, కొబ్బరికాయ ఉంటే పండ్లలో ఉంటుంది.
కానీ ప్రాసెస్ చక్కెర చెరుకు బీట్రూట్ లాంటి వాటిలో ఉంటుంది.
చక్కెరను తక్కువగా తీసుకోవడం మంచిదే కానీ పూర్తిగా వదిలేయకూడదు.చెరుకు, బీట్రూట్ లతో ప్రాసెస్ చేసే సుక్రోస్లో కీలరీలు అధికంగా ఉంటాయి.
అయితే ఇందులో న్యూట్రియెంట్ పోషకాలు మాత్రం ఉండవు.కానీ నేచురల్ చక్కెరలో విటమిన్స్, మినరల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి.
చక్కెరతో చేసిన పదార్థాలు అంటే దాదాపు చాలామందికి ఇష్టమే.
అందువల్ల పూర్తిగా తినడం మానివేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.పంచదారను ఒక్కసారిగా మానేస్తే చెడు అలవాట్లను ఒక్కసారిగా మానేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అలాగా ఉంటుందని అధ్యయనాలలో తెలిసింది.తలనొప్పి సమస్య కూడా వేధించే అవకాశం ఉంది.
పంచదార మానేయడం వల్ల ఈ ప్రభావం శరీరంపై నెమ్మదిగా చూపిస్తుంది.చక్కర ను తీసుకోవడం పూర్తిగా మానేయడం వల్ల అలసట ఎక్కువగా అవుతుంది.
శరీరంలో ఉండే ఇన్సులిన్ కూడా తగ్గే అవకాశం ఉంది.అందుకోసమే చక్కర ను పూర్తిగా మానివేయకుండా నియంత్రణలో ఉంచడమే మంచిది.