వందకు పైగా సినిమాల్లో నటించిన టాలీవుడ్ నటులు వీరే

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది హీరోలు అద్భుత‌మైన సినిమాల్లో న‌టించారు.ప్రేక్ష‌కుల‌కు అభిమాన తార‌లుగా మారారు.

 Tollywood Heros Who Acted In More Than Hundred Movies, Tollywood , Balajrishna,-TeluguStop.com

చ‌క్క‌టి సినిమాల‌తో స్టార్ హీరోలుగా ఎదిగారు.ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొంటూ వంద సినిమాల‌కు పైగా న‌టించిన హీరోలు ఎంతో మంది టాలీవుడ్‌లో ఉన్నారు.

ఇంత‌కీ వారెవ‌రో ఇప్పుడు చూద్దాం.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు.

ఆయన తన సినీ కెరీర్ లో 560 పైగా సినిమాల్లో న‌టించారు.విలన్, కమెడియన్, హీరో పాత్ర‌ల్లో అందిరీ ఆక‌ట్టుకున్నారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న కెరీర్‌లో 345 పైగా సినిమాలు చేశారు.అనేక పాత్రల్లో ప్రేక్ష‌కులను ఆకట్టుకున్నారు.

యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సినిమాల్లోనూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకున్నారు.

Telugu Balajrishna, Chiran Jeevi, Krishnam Raju, Shoban Babu, Tollywood-Telugu S

టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపారు ఎన్టీఆర్‌.మొత్తం 303 సినిమాల్లో ఆయన న‌టించారు.ఎన్నో పౌరాణిక, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో న‌టించి మెప్పించారు.ఎన్టీఆర్ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ పేరు అక్కినేని నాగేశ్వరరావు.256 సినిమాల్లో ఆయన నటించారు.విభిన్న పాత్ర‌ల్లో ఆయ‌న అంద‌రినీ మెప్పించారు.ఆయన లాస్ట్ మూవీ మనం.చంద్ర‌మోహ‌న్ సైతం ఎన్నో చ‌క్క‌టి చిత్రాలు చేశాడు.ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎన్నో మూవీస్ చేశాడు.

ఆయ‌న‌ 500 పైగా సినిమా సినిమాల్లో నటించారు.కృష్ణం రాజు సైతం 100కు పైగా సినిమాల్లో న‌టించారు.మాస్‌, క్లాస్‌ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.రెబ‌ల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయ‌న మొత్తం 190 సినిమాల్లో నటించారు.

Telugu Balajrishna, Chiran Jeevi, Krishnam Raju, Shoban Babu, Tollywood-Telugu S

త‌న న‌ట‌న‌తో మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి.151 చిత్రాల్లో ఆయన నటించారు.మాస్, క్లాస్ న‌టుల‌ను ఆక‌ట్టుకున్నాడు చిరంజీవి శ్రీకాంత్ సైతం 123సినిమాల్లో నటించారు.గ్లామ‌ర్ బాయ్‌లా ప‌లు క్యారెక్ట‌ర్లు చేశాడు.అమ్మాయిల మ‌న‌సులు దోచిన శోభ‌న్ బాబు సైతం 120 సినిమాల్లో న‌టించారు.ఈ టాలీవుడ్ అందగాడు ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు నంద‌మూరి బాలకృష్ణ సైతం 102 సినిమాల్లో న‌టించి మెప్పించారు.

బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎన్నో మాస్, క్లాస్ సినిమాల్లో నటించారు టాలీవుడ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తన నటనతో పైకొచ్చాడు జగపతి బాబు.తండ్రి నిర్మాత అయినా త‌న స్వ‌శ‌క్తితో హీరోగా స‌క్సెస్ అయ్యాడు.

ప్ర‌స్తుతం ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఆయ‌న 100కు పైగా సినిమాల్లో న‌టించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube