టాలీవుడ్ హీరోలకున్నంత అభిమానులు మరే పరిశ్రమలోనూ ఉండరంటే అతిశయోక్తి కాదు.తెలుగులో టాప్ స్టార్స్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చేది మహేష్ బాబు, పవన్ కల్యాన్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్.
ఈ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానుల సందడి మామూలుగా ఉండదు.ఆయా హీరోల సినిమాలు తొలి రోజు ఎంత కలెక్షన్ సాధించింది అనే విషయాలను తమ ఫ్యాన్స్ బాగా ప్రచారం చేసుకుంటారు.
తమ హీరో అంటే తమ హీరో గొప్ప అని చెప్పుకుంటారు.అయితే ఈ ఆరుగురు హీరోలు తమ తొలి సినిమాలతో పోల్చితే ఇప్పుడు ఎంతో మారిపోయారు.
వారిలో వచ్చిన మార్పులు ఆశ్చర్య కలిగించక మానదు.ఇంతకీ వాళ్లు.అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం.
పవన్ కల్యాణ్
మెగాస్టార్ సోదరుడిగా పవన్ కల్యాణ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.ఈవీవీ దర్శకత్వంలో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.అప్పుడు తన రూపానికి తాజాగా వచ్చిన వకీల్ సాగ్ లో తన ఫేస్ కట్ కు ఎంతో మార్పు వచ్చింది.
మహేశ్‌బాబు
క్రిష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చాడు.1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన రూపానికి అప్పటి తన ఫేస్ కు ఎంతో తేడా ఉంది.
జూనియర్ ఎన్టీఆర్
నందమూరి నటవారసుడిగా 2001లో వెండి తెరకు పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలని సినిమా చేశాడు.అప్పట్లో తన ఫిజిక్ పట్ల విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్రస్తుతం ఎంతో గ్లామరస్ గా మారిపోయాడు.
ప్రభాస్
2002లో సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్.జయంత్ సి పర్జానీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా చేశాడు.అప్పుడు బక్క పలుచగా ఉన్న ప్రభాస్.
తాజాగా రాధేశ్యామ్ సినిమాకు వచ్చే సరికి ఊహించని రీతిలో మారిపోయాడు.ప్రస్తుతం సిక్స్ ఫ్యాక్ తో అద్భుతంగా తయారయ్యాడు.
అల్లు అర్జున్
2003లో రాఘవేంద్రరావు గంగోత్రి సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్.ఈ సినిమాతో తను చెత్త ఫేస్ తో కనిపించాడు.నెమ్మదిగా లుక్ మార్చుకుంటూ ప్రస్తుతం గ్లామరస్ హీరోగా మారిపోయాడు.
రామ్‌చరణ్
మెగాస్టార్ నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు రామ్ చరణ్.2007లో పూరీ దర్శకత్వంలో చిరుత అనే సినిమా చేశాడు.అప్పట్లో ఆయన ఏమాత్రం అందంగా కనిపించలేదు.
ప్రస్తుతం తను ఎంతో మారిపోయి.అందంగా కనిపిస్తున్నాడు.