ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎవరు చూస్తారు చెప్పండి.ఒక్కోసారి గ్లామర్ టచ్ మరొకసారి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు.
ఇలా మల్టిపుల్ విషయాలపై ఫోకస్ చేస్తే తప్ప మనుగడ లేని రోజులు ఇవి.అన్నీ చూపించినా కూడా ఒక్కోసారి ఎవరూ పట్టించుకోవడం లేదు.అరకొరగా చూపిస్తే అంతకన్నా పట్టించుకోవడం లేదు.అందుకే ఇప్పటి తరం హీరోయిన్లు చాలా తెలివిగా తమ కెరియర్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఒకప్పుడు సమంత( Samantha ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా సినిమాలు తీస్తూ వచ్చింది.కానీ ఒక్కసారిగా పుష్ప సినిమాతో తన హద్దులన్నీ చేరిపేసింది.
మహానటి సినిమా వరకు కీర్తి సురేష్( Keerthy Suresh ) కూడా ఎంతో పద్ధతిగా ట్రెడిషనల్ బట్టలు లేదంటే మినిమం ఎక్స్పోజింగ్ తోనే మేనేజ్ చేస్తూ వచ్చిన ఆ తర్వాత తనను తాను గ్లామర్ డాల్ గా మార్చుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.ఇక కృతి శెట్టి ( Kriti Shetty )లాంటి హీరోయిన్ కూడా గ్లామర్ ఇమేజ్ కోసం తహతహలాడుతుంది.మరోవైపు శ్రీలీల( Sreelila ) కూడా గుంటూరు తర్వాత డ్యాన్స్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటుంది.అయితే వీరి తరహా ఇలా ఉంటె సీనియర్ హీరోయిన్స్ పరిస్థితి మరోలా ఉంది.
సమంతా, కాజల్, తమన్నా, నయన్ లాంటి సీనియర్ హీరోయిన్స్ యాక్షన్ సినిమాలకు పై ఫోకస్ పెట్టి వారి ఇమేజ్ మార్చుకోవాలి అనుకుంటున్నారు.
ఇక అనుపమ లాంటి హీరోయిన్స్ అయితే చెప్పక్కర్లేదు.బోల్డ్ సీన్స్ చేసిన పర్వాలేదు క్యారెక్టర్స్ మాత్రమే రావాలి అని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.ఇలా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా కూడా మునుపటి ఇమేజ్ కన్నా కూడా కొత్త ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు బోల్డ్ గా ఉన్న వారు నటన కు అవకాశం కావలి అనుకుంటున్నారు.ఇక నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసిన వారు గ్లామర్ ఆరబోయాలి అనుకుంటున్నారు.
వీరి ఆశలు నెరవేరి కొత్త అవకాశాలు వస్తాయా లేక ఉన్న సినిమాలు కూడా పోయి గల్లంతవుతాయా అని తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.