తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.తాను కందిపప్పు లాంటివాడినన్న ఆయన ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు.
కానీ కేటీఆర్ గన్నేరుపప్పు లాంటి వారన్న రేవంత్ రెడ్డి తింటే చస్తారని విమర్శలు చేశారు.ఆరోగ్యం బాగుండాలంటే కంది పప్పు, ముద్ద పప్పును తీసుకోండన్నారు.
గన్నేరుపప్పుకు దూరంగా ఉండాలని చెప్పారు.ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.