దాదాపు కొన్ని నెలల నుంచి సినిమాలు చిత్రీకరణ జరుపుకోక చిత్ర పరిశ్రమ ఎంతో వెలవెలబోయింది.తాజాగా ఒక్కో చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ప్రేక్షకులముందుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.
అయితే సంక్రాంతి బరిలోకి స్టార్ హీరోల సినిమాలు వస్తాయని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.అయితే ఆ సినిమాలు తిరిగి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం నాలుగు సినిమాలు తప్ప మిగతా అన్ని సమ్మర్లో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.అయితే వేసవిలో విడుదల కాబోయే చిత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపడం లేదు.అన్ని సినిమాలను వేసవికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే సంక్రాంతి రేసులో ఉన్న నితిన్” రంగ్ దే”, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగచైతన్య లవ్ స్టోరీ, ఇవన్నీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాలన్నీ వేసవి సెలవుల వరకు వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే నితిన్ నటించిన రంగ్ దే చిత్రం మార్చి 26న కు వాయిదా పడింది, ఇదే తేదీన రానా నటించిన అరణ్యం సినిమా కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇక నాచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ ఏప్రిల్ 16న విడుదల కాబోతుంది.నాగచైతన్య లవ్ స్టోరీ వేసవి లో వస్తుందా లేక ముందే విడుదల అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.
అయితే స్టార్ హీరోలు నటిస్తున్న ఆచార్య, ప్రభాస్ రాదే శ్యామ్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాలు కూడా వేసవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ స్టార్ హీరోల సినిమాలు సమ్మర్లో విడుదల తేదీని ఖరారు చేస్తే చిన్న సినిమాలు సైతం మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్స్ సినిమాలే కాకుండా మరోవైపు కన్నడ స్టార్ యష్ నటిస్తున్న కేజిఎఫ్ 2 కూడా వేసవిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలన్నీ సమ్మర్లో బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టు పోటీపడి ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.