ఎడిటోరియల్ : కేసీఆర్ లో మార్పు వచ్చిందా ? ఇప్పుడే ఎందుకో ?

ఘోరంగా దెబ్బ తింటే గాని అసలు వాస్తవం ఏమిటి అనేది టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా తెలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఎప్పుడు ఎక్కడ తెలంగాణలోఏ ఎన్నికలు జరిగినా తమదే పైచేయి తప్ప మరెవరికీ తెలంగాణలో స్థానం లేదని ఊహల పల్లకిలో ఉంటూ వచ్చారు.

 There Sseems To Be A Clear Change In Kcr Compared To The Past, Bjp, Congress, Du-TeluguStop.com

తమకు ప్రధాన రాజకీయ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ ను బలహీనం చేస్తే, ఇక టిఆర్ఎస్ కు తప్ప ఏ పార్టీకి భవిష్యత్తులోనూ అధికారం దక్కే ఛాన్స్ ఉండదు అని కేసీఆర్ అంచనా వేశారు.దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను టిఆర్ఎస్ లో చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అనుకున్నట్టుగానే తెలంగాణలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ మారిపోయింది.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లే కాకుండా, టిఆర్ఎస్ కు ఎప్పటికైనా ప్రత్యామ్నాయం అవుతోందని టిడిపిని బలహీనం చేస్తూ అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు.అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు అనే విషయాన్ని కెసిఆర్ గుర్తించలేకపోయారు.

2014 నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చిన కెసిఆర్ హవాకు ఒక్కసారిగా దుబ్బాక ఉపఎన్నికలు బ్రేక్ వేశాయి.ఆ వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ముందుగా అంచనా వేసిన దానికంటే అతి తక్కువ స్థానాలు దక్కాయి.దీంతో వాస్తవం ఏమిటనే విషయం తెలుసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ప్రజల మద్దతు తమకి ఎప్పుడూ ఉంటుందని, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తీసుకు వస్తాయనే భ్రమలు కేసీఆర్ కు, ఆ ఆ పార్టీ నాయకులలోనూ తొలగిపోయాయి.దీనికితోడు కెసిఆర్ లో కనిపించే కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారడంతో, టిఆర్ఎస్ ఊహించని విధంగా ఎన్నో దెబ్బలు తినాల్సి వచ్చింది.

ఇప్పుడు మరిన్ని నష్టాలు చోటు చేసుకోక ముందే పార్టీని ఒక గాడిలో పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకునే విషయం పై కేసీఆర్ దృష్టి సారించారు.అందుకే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే ఉద్దేశంతో తన మేనల్లుడు తెలంగాణ మంత్రి హరీష్ రావు ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.

మొదట్లో కెసిఆర్ హరీష్ రావు పెద్దగా పట్టించుకోనట్టుగా కనిపించారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత మంత్రివర్గ విస్తరణ లో హరీష్ రావు కు చోటు కల్పించలేదు.

అయినా ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా హరీష్ పార్టీకి మేలు చేస్తూ వస్తున్నారు.

Telugu Congress, Dubka, Farm, Ghmc, Greter, Hareesh Rao, Telangana-Telugu Politi

ఇప్పుడు అటువంటి నాయకులను దూరం పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు అనే విషయాన్ని గుర్తించి వారికి క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు.క్షేత్రస్థాయిలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా, ప్రజలలో టిఆర్ఎస్ బలం పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.

గత పది రోజులుగా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ పార్టీలోను, ప్రభుత్వంలోనూ మార్పు తీసుకు వచ్చేందుకు ప్రజల్లో టిఆర్ఎస్ బలం మరింత పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.

అలాగే యువతలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించిన ఆయన, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇలా అన్ని విషయాల్లోనూ లోటు పాట్లను సరి చేసుకుంటూ టిఆర్ఎస్ `కు తిరుగులేకుండా చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ ముందుచూపు ఏదో మొదటి నుంచి ఉండి ఉంటే, టిఆర్ఎస్ పరిస్థితులు వచ్చి ఉండేది కాదని బీజేపీ బలం పెంచుకునే ఉండేది కాదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి.

కాస్త ఆలస్యమైనా అసలు విషయాన్ని కెసిఆర్ తెలుసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube