ఫ్లోరిడాలో రెండు భాగాలుగా విడిపోయిన ఆకాశం.. వీడియో చూస్తే..

సోషల్ మీడియా( Social media )లో ప్రకృతికి సంబంధించి ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని అద్భుతంగా ఉంటాయి.

 The Sky Split Into Two Parts In Florida If You See The Video , Viral Video, Late-TeluguStop.com

అవి చూస్తే మన కళ్లను మనమే నమ్మలేము.అలాంటి ఒక స్టన్నింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ ట్విట్టర్ పేజీ @ సైన్స్ గర్ల్ షేర్ చేసిన దాదాపు ఈ క్లిప్ కు చాలా తక్కువ సమయంలోనే కోటి దాక వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో ఆకాశం రెండు భాగాలుగా వేరయ్యి వేరువేరు కలర్లలో కనిపించింది.ఆ ఫినామినాని స్ప్లిట్ సన్‌సెట్( Split Sunset ) అంటారని కూడా ట్విట్టర్ పేజీ వివరించింది.హోరిజోన్ కింద ఉన్న పెద్ద మేఘం నీడ వల్ల ఇలా ఆకాశం రెండు భాగాలుగా విడిపోయి రెండు కలర్స్‌లో కనిపిస్తుందని తెలిపింది.

సూర్యరశ్మి భూమిపై ఉన్న పరిశీలకులకు దగ్గరగా ఉండే మేఘాలను చేరకుండా నీడ నిరోధించడం వల్ల ఇది జరుగుతుందట.ఈ అరుదైన ఘటన ఫ్లోరిడాలో జరిగినట్లు తెలిపింది.

ఏది ఏమైనా ఆకాశం రెండు డిఫరెంట్ కలర్స్ లో కనిపించడం చూసి చాలామంది అబ్బురపడుతున్నారు.సినిమాల్లో మాత్రమే గ్రాఫిక్స్ తో ఇలాంటి అద్భుతాలు సృష్టించడం సాధ్యమవుతుందని మనం అనుకుంటాం.కానీ ప్రకృతి మానవుల కంటే మరింత నేచురల్ అద్భుతాలు సృష్టిస్తుంది.ఆ మాటలకు ఈ వైరల్ వీడియోనే నిదర్శనం గా నిలుస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు.ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని, వీడియో చూస్తుంటే వావ్ అనకుండా ఉండలేకపోతున్నామని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.కొత్త నాలెడ్జ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకొందరు తెలిపారు.8 సెకన్ల నిడివి గల ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube