ఈ ఒక్క డైమండ్ ధర అక్షరాలా రూ.478 కోట్లు.. దాని స్పెషల్ ఏంటంటే..!

వజ్రాల్లో పింక్ కలర్ వజ్రం చాలా అందంగా ఉంటుంది.ఇది దొరకడం చాలా అరుదు.

 The Price Of This Single Diamond Is Literally Rs. 478 Crores What Is Special Ab-TeluguStop.com

అందుకే వేలంలో ఎప్పుడూ కూడా ఇవి చాలా ఎక్కువ ధరకు అమ్మడవుతాయి.ఈ శుక్రవారం రాత్రి కూడా ఒక పింక్ డైమండ్ చాలా అధిక ధర పలికింది.వేలం హౌస్ సోథెబీస్ 11.15 క్యారెట్ల అరుదైన పింక్ డైమండ్‌ను ఏకంగా 57.73 మిలియన్ల డాలర్స్ లేదా రూ.478.19 కోట్లకు విక్రయించింది.‘ది విలియమ్సన్ పింక్ స్టార్’గా పిలిచే ఈ డైమండ్ ప్రపంచంలోని స్వచ్ఛమైన వజ్రాలలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.ఈ ధర ట్యాగ్‌లో సోథెబీ హాంకాంగ్ వేలంపాట ఫీజులు ఉన్నాయి.

ఈ విలువైన వజ్రాన్ని కలెక్టర్ బోకా రాటన్ విక్రయించారు.

దీనికి రోసెన్‌బర్గ్ విలియమ్సన్ పింక్ స్టార్‌గా పేరు మార్చారు.ఈ విక్రయంతో విలియమ్సన్ పింక్ స్టార్ వేలంలో అమ్ముడైన రెండో అత్యంత ఖరీదైన వజ్రం అని ఫోర్బ్స్ నివేదించింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆక్షన్డ్‌ డైమండ్ రికార్డు ఇప్పటికీ సీటీఎఫ్ పింక్ స్టార్ పేరు మీద ఉంది.ఈ 59.60-క్యారెట్ ఓవల్ మిక్స్‌డ్-కట్ డైమండ్ ఏప్రిల్ 2017లో సోథెబైస్‌లో 71.2 మిలియన్ల డాలర్స్ లేదా రూ.589.76 కోట్లకు విక్రయించబడింది.

Telugu Diamond, Boca Raton-Latest News - Telugu

విలియమ్సన్ పింక్ స్టార్ వేలంలో కనిపించని రెండవ అతిపెద్ద పింక్ డైమండ్.టాంజానియాలోని విలియమ్సన్ మైన్‌లో 32 క్యారెట్ రఫ్ డైమండ్‌ను బాగా సానబెట్టి ఈ విలియమ్సన్ పింక్ స్టార్‌ను తయారు చేశారు.జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA)కి అందించిన అన్ని డైమండ్స్‌లో 3% కంటే తక్కువ వజ్రాలు వేరే రంగులో ఉన్నాయి.ఆ 3 శాతంలో 5% కంటే తక్కువ డైమండ్స్ పింక్ కలర్‌లో ఉన్నాయని అమెరికన్ వేలం హౌస్ పేర్కొంది.

అంటే ఇవి ఎంత అరుదో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube