మండపంలో మిస్సైన వరుడు... వధువుని మెచ్చుకున్న అతిథులు, విషయమిదే!

అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.మరికాసేపట్లో పెళ్లి అనగా వరుడు హఠాత్తుగా మాయమయ్యాడు.

 The Groom Who Was Missing In The Mandapam The Guests Who Appreciated The Bride ,-TeluguStop.com

ఈ సంగతి తెలుసుకున్న వధువు గుండె జారిపోయింది.అయితే కాసేపటికి తేరుకొని వరుడు లేకుండానే పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది.

పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి ఫొటోలను కూడా క్లిక్ మనిపించారు.ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే… బ్రిటన్‌లోని వేల్స్‌లో నివసిస్తున్న కైలీ స్టెడ్ వివాహం సెప్టెంబర్ 15న జరగాల్సి ఉంది.ఈ వివాహ నిర్వహణకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశారు.

 The Groom Who Was Missing In The Mandapam The Guests Who Appreciated The Bride ,-TeluguStop.com

ఆహూతులందరూ విందుభోజనాలను ఎంజాయ్ చేసారు.మరికాసేపట్లో రింగ్స్ మార్చుకుంటారు అనుకుంటుండగా వరుడు మాయమయ్యాడని వధువు కైలీకి తెలిసింది.ఇది విన్న కైలీకి దిక్కుతోచలేదు.అయితే ఇలా జరిగినప్పటికీ అతిథి మర్యాదలు పాటించడంతో పాటు వివాహ కార్యక్రమాలన్నీ పూర్తిచేసింది.

బీమా కంపెనీలో పనిచేస్తున్న కైలీ, తాను వరుడి కోసం 4 గంటల పాటు వేచి ఉన్నానని చెప్పింది.పలుమార్లు అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని, అతను ఇక రాదని క్లారిటీ వచ్చిన వెంటనే కంగారు పడ్డానని చెప్పింది.

Telugu Groom, Kylie Steads, Latest-Latest News - Telugu

కాగా కైలీకి, ఆమె ప్రియునికి 2018లో పరిచయమయ్యింది.పెళ్లికి ఒకరోజు ముందు కైలీ, ఆమె స్నేహితులు హాలిడే హోమ్స్‌లో వేడుకలు చేసుకున్నారు.నాటి అనుభవం గురించి కైలీ మాట్లాడుతూ ‘నేను, నా ప్రియుడు పెళ్లికి ఒక రోజు ముందు మాట్లాడుకోకూడదని నిర్ణయించుకున్నాం.అటువంటి పరిస్థితిలో, అతనికి ఏమయ్యిందో అస్సలు తెలియలేదు.

నా బాయ్ ఫ్రెండ్ స్నేహితునికి ఫోన్ చేస్తే అతను వెళ్లిపోయాడని చెప్పాడు.కైలీ అత్త కూడా ఇటువంటి సమాధానమే ఇచ్చారని తెలిపింది.

దాంతో పెళ్ళితంతులో గందరగోళం సృష్టించడం ఎందుకని మిగతా కార్యక్రమాలను సైలెంట్ గా పూర్తి చేశామని కైలీ చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube