సాలూరు మున్సిపాలిటీ ఒకటవ వార్డ్ గుమ్మడం లో పర్యాటనలో భాగంగా సంక్షేమ పథకాలు మీకు ఎవరు ఇస్తున్నారు అని డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రశ్నించగా ఆమె వలంటైర్ ఇస్తున్నారు అని చెప్పింది.ఆ మాట వినగానే రాజన్న చిర్రెత్తిపోయి అక్కడున్న మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బందిపై సీరియస్ అయ్యారు.
మొన్న గడపగడపకు సాలూరు మండలం శివారాంపురం వెళ్ళినప్పుడు కూడా వలేంటర్ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు.ఇలా అయితే ఎంపీడీఓ,కమిషనర్ సస్పెండ్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు టైంలో పథకాలు ఎవరిచ్చారు అంటే చంద్రన్న ఇచ్చారని చెప్పేవారు,ఎప్పుడు జగనన్న ఇస్తే వలంటైర్ ఇస్తున్నారని చెప్తున్నారు.ఇది కరెక్ట్ కాదు.మీరంతా మధ్యాన్నం 3గంటలకి మీటింగ్ పెట్టి రావాలని ఆదేశించారు.సచివాలయ సిబ్బంది,వలంటైర్,మున్సిపల్ సిబ్బంది,మండల ఆఫీస్ సిబ్బంది తక్షణమే మీటింగ్ కి అటెండ్ అవ్వాలని ఆదేశించారు.