పుస్తకాన్ని సరియైన ద్రృక్పధంతో చదవాలి: కవి రవి మారుత్

పుస్తకాన్ని సరియైన ద్రృక్పధంతో చదవాలని ప్రముఖ విద్యావేత్త,కవి రవిమారుత్ అన్నారు.సోమవారంనాడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా లకారంటాంక్ బండ్ వేదిక మీద ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యులు ప్రసేన్ అధ్యక్షతన పారుపల్లి అజయ్ కుమార్ రాసిన పుస్తకం –నమస్తుభ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పుస్తకం పఠనం వల్ల జీవితానికి అద్భుతమైన జీవనధ్రృక్పధం ఏర్పడుతుందన్నారు.

 The Book Should Be Read With The Right Perspective Poet Ravi Marut, Poet Ravi M-TeluguStop.com

అనంతరం ప్రముఖ కవి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా,జ్ఞాన సమాజాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు.డబ్బలు సంపాదించడం తేలిక, జ్ఞానాన్ని సంపాదించడం కష్టం అన్నారు.

కార్యక్రమంలో దుర్గా భవాని,నాగమల్లేశ్వరరావు, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, అధ్యాపకులు డా.సి.వి.మురళీధర్,డా.శాంతికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube