ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉన్నా, రాజకీయ పార్టీల హడావుడి మాత్రం రేపో, మాపో అన్నట్లుగా ఉంది.ఇప్పటి నుంచే పొత్తులు ఎన్నికల వ్యూహాలపై అన్ని పార్టీలు నిమగ్నం అయిపోయాయి.
ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసుకుని బీజేపీ ,జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆందోళనలు, పోరాటాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి.కొన్నికొన్ని సందర్భాల్లో మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు చేస్తున్నాయి.
ఈ పోరాట కారణంగానే వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా పెంచవచ్చనే వ్యూహంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు.ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఆపార్టీ బీజేపీతో పొత్తు కోసం ఎంతగానో ప్రయత్నించినా, పెద్దగా ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు.
దీంతో ప్రత్యామ్నాయంగా జనసేన పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది.
ఈ పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే అప్పుడే.వైసీపీ ఈ పొత్తుల వ్యవహారం పై బాగా టెన్షన్ పడుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
నిన్న జరిగిన అమరావతి మహోద్యమ సభకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.ఈ సందర్భంగా సభావేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దగ్గరకు పిలిపించి ఆయనతో మాట్లాడడం పై వైసీపీ చర్చ లేవదీసింది.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని, వైసీపీ అనుకూల మీడియా , సోషల్ మీడియా లోనూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.

అయితే చంద్రబాబుతో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడినా, పొత్తు డిసైడ్ చేయడానికి ఆయనకు అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా లేరు.అయినా వైసీపీ నేతల్లో కంగారు అయితే బాగా కనిపించింది.2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం ఎదుర్కొంది.అదే జనసేన తో కలిసి ఎన్నికలకు వెళ్లి ఉంటే అప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది అనే లెక్కలు ఇప్పుడు టీడీపీ ,జనసేనల్లో మొదలు కావడం తోనే వైసీపీ ఇంతగా టెన్షన్ పడుతున్నట్టు గా కనిపిస్తోంది.