జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల పై మరోసారి మండిపడ్డారు.
కెసిఆర్ బర్త్ డే కాదు డెత్ డే అని విమర్శించారు.
కొడుకు కేటీఆర్ డైరెక్షన్ లో తండ్రి కేసీఆర్ బర్త్ డే లను మూడు రోజుల పాటు జరపడం విడ్డూరమని తెలంగాణ రాష్ట్రానికి తండ్రి ,కొడుకులు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే మూడు రోజుల తర్వాత దశదినకర్మ జరుపుకుంటారు.అలా కేసీఆర్ కూడా మూడు రోజుల పాటు జరుపుకుంటున్నారు.