జగన్ కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం వెనుక ఇంత సినిమా ఉందా ?

తన సొంత తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ అధినేత సీఎం జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలవడం, జగన్ చాలా మంచి వ్యక్తిని చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నారని, ఆయన హయాంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుంది అంటూ అదే పనిగా చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.

ఆ తరువాత ఓ సినిమా ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మళ్లీ జగన్ ను పొగిడేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.విజయవాడలో జగన్ కు తనకు మధ్య జరిగిన సంభాషణను కూడా చిరంజీవి వివరించారు.

అన్నా మీకు ఏమి కావాలో మీరంతా ఆలోచించుకోండి మీరు ఏదంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.అంటూ జగన్ ఎంతో గౌరవంగా మాట్లాడారని, వయసులో చిన్నవాడైన జగన్ చూపించిన పరిణితి చాలా అభినందనీయం అంటూ చిరంజీవి కొనియాడారు.అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చిత్రసీమకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ చిరంజీవి పొగిడారు.

అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోవడం ఫ్యాన్స్ మధ్య గందరగోళ పరిస్థితి నెలకొనడం జరిగాయి.కానీ ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదు.ఇక చిరంజీవి జగన్ ను పొగడడం వెనుక కారణాలు ఒకసారి పరిశీలిస్తే

Advertisement

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది చిరంజీవి ఆకాంక్ష అని, అందుకే ఏపీ ప్రభుత్వంపై ఇలా సానుకూలంగా ఉన్నారని, అలాగే మెగాస్టార్ చిరంజీవి విశాఖపట్నానికి విడదీయరాని అనుబంధం ఉందట.ఇక్కడ షూటింగ్ జరుపుకున్న చిరంజీవి ప్రతి సినిమా భారీ హిట్ అవడంతో పాటు సహజమైన ప్రకృతి అందాలు కూడా ఈ ప్రాంతం సొంతం కావడంతో చిరంజీవికి ఈ ప్రాంతంపై ఎక్కువ మమకారం ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.అందుకే విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను జగన్ కు చెప్పడం ఆయన ఓకే చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నా ఆయన బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ తనయుడిగా మంచి క్రేజ్ ఉన్నా, వేలాది మందికి ఉపాధి ఇచ్చే టాలీవుడ్ పరిశ్రమ కోసం చంద్రబాబు ఎటువంటి మేలు చేయలేదని, కానీ జగన్ మాత్రం చిత్రసీమకు చెందిన వారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ వారికి అన్నీ చేసేందుకు ముందుకు వస్తుండటంతో జగన్ ను పొగిడేందుకు చిరంజీవి వెనకాడడం లేదు.ఈ విషయంలో తమ్ముడు పవన్ ను సైతం పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది.చిరంజీవి మద్దతు తనకు లభించడంపై జగన్ కూడా ఆనందంగానే ఉన్నట్టుగా సమాచారం.

దీని ద్వారా చిత్ర సీమ నుంచి మద్దతు లభించడమే కాకుండా, జనసేనను దెబ్బకొట్టవచ్చు అనేది జగన్ అభిప్రాయంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు