హైదరాబాద్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు.ఈ క్రమంలో “వ్యూహం” సినిమా పోస్టర్లను తగలబెట్టిన ఆందోళనకారులు.“వ్యూహం” సినిమాను( Vyooham Movie ) బ్యాన్ చేయాలని నినాదాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో పోలీసులు వెంటనే ఆర్జీవి ఆఫీస్ దగ్గరికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టడం జరిగింది.“వ్యూహం” ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితానికి సంబంధించినది.
ఈ సినిమా పూర్తిగా వైయస్ జగన్ కి( YS Jagan ) అనుకూలంగా ఉంటుంది రాంగోపాల్ వర్మ ముందుగానే తెలియజేయడం జరిగింది.రెండు రోజుల క్రితం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో “వ్యూహం” సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
డిసెంబర్ 29వ తారీకు ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) అదేవిధంగా నారా లోకేష్ పై( Nara Lokesh ) ఆర్జీవి వ్యంగ్యంగా విమర్శలు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే “వ్యూహం” సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.డిసెంబర్ 26వ తారీకు ఈ పిటిషన్ విచారణకు రానుందాన్ని సమాచారం.
అప్పటివరకు “వ్యూహం” సినిమా విడుదల చేయకూడదని ఆల్రెడీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సినిమా ద్వారా వైయస్ జగన్ కి లబ్ధి చేకూరుస్తూ.చంద్రబాబుని తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు.పిటిషన్ లో తెలియజేయడం జరిగింది.ఇలాంటి సమయంలో హైదరాబాద్ ఆర్జీవి ఆఫీస్ ఎదుట ఆందోళనలు నిర్వహించడం సంచలనంగా మారింది.