తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలో అసెంబ్లీని ముట్టడించేందుకు వడ్డెర కుల సంఘం నాయకులు ప్రయత్నించారు.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.