లిప్టులో ఇరుక్కున్న ప‌దేండ్ల చిన్నారి.. ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడంటే..

కొన్ని సార్లు మ‌న దేశంలో జ‌రిగే ఘ‌ట‌న‌లు అంద‌రినీ షాక్ గురి చేస్తుంటాయి.మ‌రీ ముఖ్యంగా చిన్న పిల్ల‌ల విష‌యంలో కొన్ని ఘ‌ట‌న‌లు చాలా బాధాక‌రంగా ఉంటున్నాయి.

 Ten Years Child Trapped In The Lift How To Get Out, Trapped In Lift, Viral News,-TeluguStop.com

పొర‌పాటును కారు కింద ప‌డ‌ట‌మో లేదంటే ఆడుకుంటుండగా బిల్డింగ్ మీద నుంచి ప‌డిపోవ‌డం లాంటివి త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు కూడా ఓ పదేండ్ల బాలుడి విష‌యంలో ఇలాగే జ‌రిగింది.

దీన్ని చూసిన వారంతా కూడా విచార‌ణ వ్య‌క్తం చేస్తున్నారు.ఢిల్లీకి శివారులోని గజియాబాద్ ప్రాంతంలో ఓ పదేళ్ల బాబు అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.

గజియాబాద్ ప్రాంతంలోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని కేడబ్ల్యూ శ్రిష్టి సొసైటీలోని డీ టవర్ లో త‌న ఫ్రెండ్స్ ను క‌లిసేందుకు ఆ బాబు ఇక్క‌డ‌కు వచ్చాడు.అయితే లిఫ్ట్‌లో పైకి వెళ్తున్న క్ర‌మంలో అనుకోకుండా లిఫ్ట్ ఆగిపోయింది.

దీంతో ఎవాన్ అనే బాలుడు ఒక్క‌డే ఆ లిఫ్టులో ఉండ‌టంతో తీవ్రంగా భ‌య‌ప‌డిపోయాడు.ఎంత‌లా అరిచినా కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

దాదాపు ప‌ది గంట‌ల పాటు ఆ లిఫ్టులోనే బాధ ప‌డ్డాడు.గాలి ఆడ‌క‌పోవ‌డంతో బట్టలు కూడా తీసేసి అలాగే సాయం కోసం అరుస్తూనే ఉన్నాడు.

అయితే చివ‌రుకు అతి కష్టం మీద డోర్స్ ఓపెన్ కావ‌డంతో ప్రాణాల‌తో బయటపడ్డాడు.

Telugu Boy Trapped, Delhi, Evan, Ghaziabad, Raj Nagar, Child, Trapped-Latest New

ఇదంతా కూడా అక్క‌డున్న లిఫ్టు సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో అది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.అయితే ఎవాన్ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి కావ‌డంతో అత‌ని మానసిక ప‌రిస్థితి చాలా విచిత్రంగా ఉంద‌ని త‌ల్లిదండ్రులు వాపోతున్నారు.అత‌ను ఇప్పుడు లిఫ్ట్ ను చూస్తేనే వ‌ణికిపోతున్నాడ‌ని వివ‌రిస్తున్నారు.

కాగా ఎవాన్ తండ్రి ఈ ఘ‌ట‌న‌పై నంద్‌గ్రామ్ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశాడు.లిఫ్టును స‌రిగ్గా మెయింటెనెన్స్ చేయ‌క‌పోవ‌డంపై కంప్ల‌యింట్ ఇచ్చాడు.

దీనిపై పోలీసులు కూడా ద‌ర్యాప్తు చేస్తున్నారు.ఇంకో విష‌యం ఏంటంటే లిఫ్టు ఓపెన్ చేసే క్ర‌మంలో ఎవాన్‌కు గాయాలు అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube