ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాతో హిట్ కొట్టి టీమ్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.
వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.
ఆర్ఆర్ఆర్ మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.
ప్రెసెంట్ ఆర్ ఆర్ ఆర్ మ్యానియా దేశమంతటా నడుస్తుంది.
అయితే రాజమౌళి తన ప్రతిభను మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చూపించాడు.ఈయన సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన తన ప్రతి సినిమాను ఏళ్ల పాటు చెక్కుతాడు కాబట్టి ఈయనకు జక్కన్న అనే పేరు కూడా వచ్చింది.
ఇక ఇప్పటి వరకు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.దీంతో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా సెన్సేషనల్ గా ప్లాన్ చేసారు.ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో ఈ భారీ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక క్రేజీ బజ్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.ఈ సినిమాకు ఏకంగా 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని ఒక షాకింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాకి ఫైనల్ బడ్జెట్ గా 500 కోట్లు పెడుతున్నట్టు తెలుస్తుంది.మరి ఇందులో నిమేన్తో తెలియదు కానీ ఈ సినిమా బడ్జెట్ వార్త అయితే నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.