హిందువులు ప్రతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.ప్రతి పండగకి దేవుళ్లను ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు.
కొన్ని పండుగలకు ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.చాలా పండుగలను మనదేశంలోనీ హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ జరుపుకుంటారు.
అలాగే నవరాత్రుల సమయం లో దుర్గాదేవిని పూజించడం ఉపవాసం ఉండడం వల్ల మన జీవితంలో ఆనందం, శాంతి కలుగుతుంది.
భక్తులు నవ రాత్రుల తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో ఆరాధిస్తూ ఉంటారు.
నవరాత్రుల లో ఉపవాసం ఉండే వారి కోసం కొన్ని నియమాలు ఉన్నాయి.ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడం.
పూజ చేసే సమయంలో మంత్రం, చాలీసా, దుర్గా సప్తశతి జపిస్తూ అస్సలు లేవకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అలాగే మధ్యలో ఎవరితో నూ మాట్లాడకూడదు.
ఇలా చేస్తే పూజ ఫలితం అస్సలు దక్కదు.
నవరాత్రుల సమయంలో గుడి ని శుభ్రంగా ఉంచి ప్రతిరోజు ఉదయం శుభ్రం గా స్నానం చేసి పూజ చేయడానికి రావాలి.దుర్గాదేవి పూజ చేసేటప్పుడు తోలు తో తయారుచేసిన ఏ వస్తువును తీసుకొని రాకూడదు.నవరాత్రుల సమయంలో పగలు నిద్రపోవడం నిషేధమని విష్ణు పురాణం చెబుతోంది.
నవరాత్రులలో చేసి పూజలు ఎంతో పవిత్రంగా చేయాలి.
నవరాత్రి సమయంలో ఉపవాసం ఉన్న వ్యక్తి పూజలు చేయడం మాత్రమే కాకుండా భజన,0 కీర్తనలు కూడా చేసి దుర్గాదేవిని ఆరాధించాలి.
నవరాత్రుల సమయంలో వెల్లుల్లి, ఉల్లి, మాంసం అస్సలు తినకూడదని మత పెద్దలు చెబుతారు.నవరాత్రి 9 రోజులు భక్తులకు గుడిలో ఇచ్చే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఇంత కఠినంగా ఈ నవరాత్రుల ఉపవాసాలను పాటిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభించి వారి కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాయని భక్తుల నమ్మకం.
DEVOTIONAL