ఇద్దరు పిల్లల తళ్ళైనా చెక్కు చెదరని అందం.. ఒకప్పటి హీరోయిన్ లయపై కామెంట్స్!

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరికి బాగా పాకింది అనే చెప్పవచ్చు.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.

 Heroine Laya Mesmerizes Fans With Her Adorable Pics Details, Laya,,dr. Shri Gane-TeluguStop.com

ముఖ్యంగా సామాన్యులు మాత్రం తాము కూడా సెలబ్రెటీలు కావాలి అని సోషల్ మీడియా ద్వారానే తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.

ఇక సెలబ్రెటీలు సైతం.

ఉన్న టాలెంట్ లను పెంచుకొని మేము కూడా తక్కువేం కాదు అన్నట్లు చూపిస్తున్నారు.పైగా ఫోటో షూట్ లంటూ నిత్యం తెగ ఫోటోలు దిగుతూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక ఈమధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూడా అందులో కూడా తమ వీడియోలతో బాగా సంపాదిస్తున్నారు.

కేవలం సోషల్ మీడియాకు సంబంధించిన ఒక్క ఖాతాలోనే కాకుండా.

ఇతర ఖాతాలలో కూడా సెలబ్రెటీలతో పాటు సామాన్యులు సైతం బాగా హడావిడి చేస్తున్నారు.ఇక ఒకప్పటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ టచ్ లోకి వస్తున్నారు.

తెగ రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తున్నారు.ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు.అంతేకాకుండా రీ ఎంట్రీ కూడా ఇస్తున్నారు.ఇక ఒకప్పటి హీరోయిన్లు ఇప్పటికీ అంతే అందంతో కనిపిస్తున్నారు.

నిజానికి ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా తయారయ్యారు.అందులో ఒకరు నటి లయ అని చెప్పవచ్చు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో లయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.కానీ అతి తక్కువ సమయంలో సినిమాలకు దూరం అయింది.నిజానికి లయ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక లయ జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణి గా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.అంతేకాకుండా లయకు సంగీతం, డాన్స్ పట్ల మంచి అవగాహన ఉంది.

ఇక లయ 2006 లో డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది.ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో స్థిరపడింది.

ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.ఇక మళ్లీ ఇప్పుడు అవకాశాలు ఆమె దరిలోకి లేనట్టు తెలుస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే లయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రతిరోజు ఏదో ఒక డాన్స్ వీడియో షేర్ చేస్తూనే ఉంటుంది.ఇప్పటికీ అంతే అందంతో కనిపిస్తుంది లయ.ఇదిలా ఉంటే తాజాగా తను సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.

ఇక ఆ ఫోటోని చూసిన నెటిజన్స్.

దేవుడా.ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా 18 ఏళ్ల అమ్మాయిల ఉన్నారు అంటూ.

కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా లయలో అందం ఏమాత్రం తగ్గలేదు అని అంటున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube