కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి విషయంలో హైకోర్టు కి తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది.రాష్ట్రంలో వైరస్ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు, ఏప్రిల్ 29వ తారీఖున లక్ష పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పొందుపరిచింది.

 Telangana Governament Submit Report To Court Kcr, High Court,latest News-TeluguStop.com

ఇదే క్రమంలో రాష్ట్రంలో కరోనా చికిత్స విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పది ఆసుపత్రులను గుర్తించి .కరోనా చికిత్స చేసే జాబితానుంచి తొలగించినట్లు ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

-Telugu Political News

అంతే కాకుండా దాదాపు 79 ఆసుపత్రులకు 115 నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపింది.ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాక డీజీపీ మహేందర్ రెడ్డి కూడా హైకోర్టు కు మరో నివేదిక సమర్పించడం జరిగింది.అదేవిధంగా రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు.స్పష్టం చేసింది.మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం “కరోనా థర్డ్ వేవ్” ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందని పేర్కొంది.అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కేసులు విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు.

మందుల పంపిణీ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.అదేవిధంగా కరోన మందుల విషయంలో బ్లాక్ మార్కెట్ కూడా ప్రభుత్వం అరికడుతున్నట్లు నివేదికలో కేసిఆర్ ప్రభుత్వం హైకోర్ట్ కి స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube