కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి విషయంలో హైకోర్టు కి తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది.

రాష్ట్రంలో వైరస్ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు, ఏప్రిల్ 29వ తారీఖున లక్ష పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పొందుపరిచింది.

ఇదే క్రమంలో రాష్ట్రంలో కరోనా చికిత్స విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పది ఆసుపత్రులను గుర్తించి .

కరోనా చికిత్స చేసే జాబితానుంచి తొలగించినట్లు ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. """/" / అంతే కాకుండా దాదాపు 79 ఆసుపత్రులకు 115 నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిపింది.

ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాక డీజీపీ మహేందర్ రెడ్డి కూడా హైకోర్టు కు మరో నివేదిక సమర్పించడం జరిగింది.

అదేవిధంగా రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు.స్పష్టం చేసింది.

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం "కరోనా థర్డ్ వేవ్" ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందని పేర్కొంది.

అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కేసులు విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు.మందుల పంపిణీ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.

అదేవిధంగా కరోన మందుల విషయంలో బ్లాక్ మార్కెట్ కూడా ప్రభుత్వం అరికడుతున్నట్లు నివేదికలో కేసిఆర్ ప్రభుత్వం హైకోర్ట్ కి స్పష్టం చేసింది.

కొత్త ఆఫర్లకు నో చెబుతున్న ప్రభాస్ బ్యూటీ.. ప్రభాస్ వల్లే ఈ సమస్య ఎదురైందా?