రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ వైసిపి వ్యూహాత్మకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta srinivasarao ) రాజీనామాను ఆమోదించిందని టిడిపి అనుమానం వ్యక్తం చేస్తోంది.విశాఖ స్టీల్ ప్లాంట్( Visakhapatnam Steel Plant ) ప్రైవేటీకరణకు మద్దతుగా ఎప్పుడో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
రెండు , మూడు సార్లు స్పీకర్ ను కలిసి తన రాజీనామాలు ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు ఒత్తిడి చేశారు.అయినా దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు అప్పటి నుంచి అది పెండింగ్ లోనే ఉంది.
ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, గంటా రాజీనామాను ఆమోదించడం వెనుక రాజ్యసభ ఎన్నికలు ఉండడమే కారణమని టిడిపి అభిప్రాయపడుతోంది.మూడేళ్లుగా గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆమోదించడంపై న్యాయపోరాటం చేపట్టాలని టిడిపి నిర్ణయించుకుంది .రాజకీయ కోణంలో గంటా శ్రీనివాసరావు రాజీనామాలు ఆమోదించారని టిడిపి విమర్శిస్తుంది .
రాజీనామా ఆమోదం పై తనకు అభ్యంతరం లేదని, తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు .కాకపోతే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేలా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు .ఈ విషయంలో గంటా శ్రీనివాసరావుకు పూర్తి మద్దతుగా టిడిపి నిలుస్తుంది .అంతే కాదు ఇదే విషయంపై గంటా శ్రీనివాసరావుతో చంద్రబాబు మాట్లాడినట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి కూడా అభ్యర్థులను నిలబెట్టేందుకు నిర్ణయించుకుంది .దీంతో గంటా రాజీనామా ఆమోదం విషయంలో సీరియస్ గా ఉంది.ఇప్పటికే వైసీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో, రాజ్యసభ పై టిడిపి కన్నేసింది.
అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ( TDP ) కి బలం లేకపోయినా, ఒక్క ఎమ్మల్సి స్థానాన్ని గెలుచుకుంది.అప్పటి మాదిరిగానే ఈసారి కూడా రాజ్యసభకు అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తోంది.అప్పుడు ఒక స్థానాన్ని గెలుచుకోవడంతో ఇప్పుడు పోటీకి సై అంటుంది .మార్చి నెలలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలుపడే అవకాశం ఉంది .దీంతో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపేందుకు చంద్రబాబు పార్టీలో కీలక నేతలతో చర్చిస్తున్నారు. టిడిపికి సంఖ్య బలం లేకపోయినా, అభ్యర్థిని నిలబెట్టాలని, పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఇదేవిధంగా రాజ్యసభ ఎన్నికల్లోను తమ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది అనే నమ్మకంతో టీడీపీ ఉంది.