Raghurama Krishnam Raju : టీడీపీ లోకి రఘురామ .. ఆ సీటు ఇస్తున్నారా ?

నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజుకు( Raghurama Krishnam Raju ) బిజెపి పెద్ద షాకే ఇచ్చింది.వైసీపీ నుంచి 2019లో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు కొంతకాలానికి ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదాలు ఏర్పడడంతో , పార్టీకి దూరమై జగన్ ను , వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 Tdp Planning To Give Vizianagaram Mp Seat To Ycp Rebel Mla Raghurama Krishnam R-TeluguStop.com

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  టిడిపి అధినేత


చంద్రబాబు ,లోకేష్ లతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు .మూడు పార్టీల కూటమి తరుపున ఎంపీ గా పోటీ చేయాలని రఘురామ భావించినా, బిజెపి( BJP ) ఆ అవకాశం ఇవ్వలేదు.దీంతో రఘురామ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.సీఎం జగన్( CM Jagan ) కారణంగానే తనకు సీటు రాలేదని రఘురామ ఆరోపణలు చేస్తున్నారు.అయితే కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ రఘురామ ప్రకటించారు.ఆయన ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబుతో( Chandrababu ) భేటీ అవుతున్నారు.

టిడిపిలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని రఘురామ భావిస్తున్నారు.ఇక చంద్రబాబు సైతం రఘురామ విషయంలో సానుకూలంగానే ఉన్నారు.ఆయనను పార్టీలో చేర్చుకుని విజయనగరం ఎంపీ స్థానం( Vizianagaram Parliament ) నుంచి పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.విజయనగరం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచారు.క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఎక్కువగా ఉండడంతో,  రఘురామకు అక్కడ నుంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థానం నుంచి టిడిపి ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు( Kala Venkata Rao ) పేరు పరిశీలనలో ఉంది.  ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల.

పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ టికెట్ ను బిజెపికి కేటాయించారు.

దీంతో కళా వెంకట్రావు పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు.కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు.కేంద్రం మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు కు విజయనగరం అసెంబ్లీ సీటును కేటాయించారు.

అశోక్ గజపతిరాజు( Ashok Gajapathi Raju ) ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో రఘురామ కు  విజయనగరం ఎంపీ సీటు ను చంద్రబాబు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది.  దీనిపై బిజెపి నేతలతోనూ చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే రఘురామ ఇంకా పార్టీలో చేరలేదని ,ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలనే ఆలోచన సరికాదు అంటూ కొంతమంది పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సీటు విషయంలో చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube