టాప్ కంపెనీస్ లిస్టులో టీసీఎస్‌... లింక్డ్‌ఇన్ తాజా సర్వే ఇదే!

మన దేశంలో వర్క్ చేయడానికి ఉద్యోగులకు అనువైనవిగా భావిస్తున్న కంపెనీల జాబితాలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)( Tata Consultancy Services ) మొదటి స్థానాన్ని అలంకరించింది.అవును, ఇదే విషయాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ అయినటువంటి లింక్డ్ఇన్ ( LinkedIn )తెలియజేసింది.

 Tcs In The List Of Top Companies This Is The Latest Linkedin Survey ,linkedin, A-TeluguStop.com

ఈ క్రమంలో భారత్ లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను కూడా వెలువరించింది.ఇదే వరుసలో ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్( Amazon ), ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్-ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించుకోవడం విశేషం.

ఇక గత సంవత్సరం ఈ జాబితాలో టెక్ కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శించగా.ఈసారి ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్, నిపుణుల సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సంపాదించుకోవడం విశేషం.అగ్రగామి 25 కంపెనీల్లో 10 కంపెనీల వరకు ఇవే వున్నాయి.వాటిని ఒకసారి పరిశీలిస్తే… మెక్వారీ గ్రూప్ 5వ స్థానంలోను, HDFC బ్యాంక్ 11వ స్థానములోను, మాస్టర్ కార్డ్ 12, యుబీ 14వ స్థానాల్లో నిలవడం గమనార్హం.

ఇ-స్పోర్ట్స్, గేమింగ్ రంగాల కంపెనీలు తొలిసారిగా ఈ జాబితాలో చోటు సంపాదించడం విశేషం.

ఇకపోతే కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంప్యూటర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని చేర్చుకునేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో భవిష్యత్ వృద్ధి, దీర్ఘకాల విజయాలు ఇచ్చే కంపెనీల కోసం నిపుణులు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగావకాశాలకు వెతుక్కునేందుకు వీలుగా ఈ జాబితా వెలువరించామని లింక్డ్ఇన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరాజిత బెనర్జీ తెలిపారు.

ఈ జాబితాలోని కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube