చాట్‌జీపీటీ( chatgpt ) ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ డబ్బులు సంపాదించే వారు కూడా ఇపుడు అనేకమంది వున్నారు.
విద్యార్థులకు కూడా చాట్‌జీపీటీ ఒక వరంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక స్టూడెంట్ చాట్‌జీపీటీని ఉపయోగించి చదవాల్సిన సమయాన్ని చాలావరకు తగ్గించుకున్నాడు.
దీనితో ఆ విద్యార్థి స్టడీ చేయడానికి 12 వారాలు పట్టే లెక్చర్లను 2-3 గంటల్లో పూర్తి చేసి ఎగ్జామ్‌లో 94 శాతం మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసాడు.

అవును, ఆ స్టూడెంట్ రోజుల తరబడి చదవాల్సిన భారాన్ని తగ్గించి రెండు నుంచి మూడు గంటల్లోనే చదవాల్సిందంతా కవర్ చేయడానికి చాట్‌జీపీటీ విద్యార్థికి తోడ్పడింది.నిజానికి ఈ స్టూడెంట్ ఏ క్లాసులకు హాజరు కాలేదట.ఒక్క క్లాస్ వీడియో కూడా చూడలేదు.
కానీ చాట్‌బాట్ పుణ్యమా అని 94% స్కోర్ చేసినట్లు చెబుతూ సదరు విద్యార్థి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు.వివరాల్లోకి వెళితే.u/151N అనే యూజర్‌నేమ్ గల రెడిట్ యూజర్ ఒక సెమిస్టర్ ఎగ్జామ్‌కి సిద్ధం కాలేదు.ఎగ్జామ్‌కి ఇంకా మూడు రోజుల సమయమే మిగిలి ఉందనగా ఆ విద్యార్థికి ఏం చేయాలో తోచలేదు.

ఈ క్రమంలోనే ఆ విద్యార్థికి చాట్‌జీపీటీ గురించి తెలిసింది.ప్రతి లెక్చర్ Echo360లో ట్రాన్స్‌స్క్రైబ్ చేసి ఉందని ఈ స్టూడెంట్ తెలుసుకున్నాడు.ఆ ట్రాన్‌స్క్రిప్ట్స్ విశ్లేషించడానికి, పరీక్షకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఒక లిస్ట్‌గా రూపొందించడానికి చాట్‌జీపీటీ సలహా తీసుకున్నాడు.ట్రాన్‌స్క్రిప్ట్స్‌లో చాలా టెక్స్ట్ ఉండగా.దానిని విశ్లేషించే సామర్థ్యం చాట్‌జీపీటీకి లేదని అర్థం చేసుకున్నారు.చాట్‌జీపీటీ కోసం ఆన్‌లైన్ ప్యారాఫ్రేసింగ్ టూల్‌తో ట్రాన్‌స్క్రిప్ట్‌ల టెక్స్ట్ సమ్మరైజ్ చేశాడు.
ఇంకేముంది కట్ చేస్తే రోజుల్లో చదవాల్సిన సిలబస్ కొన్ని గంటల వ్యవధిలో చదివేసి మంచి స్కోర్ చేసాడు.







