టాలీవుడ్ దర్శకనిర్మాతలలోఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaj ) ఆర్.ఆర్.
ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విషయంలో చేసిన విమర్శల గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో కౌంటర్లు వచ్చాయి.కొంతమంది సినీ ప్రముఖులు సైతం తమ్మారెడ్డి భరద్వాజపై విమర్శలు చేశారు.
అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ గురించి ఆయన మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తమ్మారెడ్డి మాట్లాడుతూ ఆ మధ్య ఎంపీనో, ఎమ్మెల్యేనో సినిమా వాళ్ల కుటుంబాలలోని ఆడవాళ్లంతా చెడిపోయినోళ్లు అనే స్టేట్ మెంట్ ను ఇచ్చారని తెలిపారు.అప్పటినుంచి ఇప్పటివరకు ఈ విషయం గురించి నేను సీరియస్ గా మాట్లాడుతున్నానని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.నేను ఈ విషయం గురించి మాట్లాడుతుంటే మిగతా మగాళ్లంతా ఏం పీ*తున్నారని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
ఆర్ఆర్ఆర్( RRR ) గురించి నేను కామెంట్లు చేసిన సమయంలో మగాళ్లంతా పోగేసుకుని వచ్చారని వాళ్ల పెళ్లాల గురించి, కూతుళ్లు, తల్లుల గురించి ఎంపీనో ఎమ్మెల్యేనో మాట్లాడితే ఇప్పుడు వాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆయన అన్నారు.మరో ఎమ్మెల్యే సినిమా వాళ్లు ఆస్తులు దోచుకున్నారని చెప్పగా దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ విసిరానని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.
నాకు స్థోమత లేకపోయినా అడిగే ధైర్యం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
మీ కుటుంబాలను కాపాడుకునే ధైర్యం లేదు మీకు? అంటూ ఇండస్ట్రీ స్టార్స్( Industry Stars ) పై ఆయన ఫైర్ అయ్యారు.మనల్ని, మనవాళ్లను కాపాడుకుంటే మాత్రమే రాష్ట్రానికి దేశానికి ఏదైనా చేయగలమని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.ప్రతిదానికి భయపడి స్వార్థంగా ఆలోచించే వాళ్లు సైతం నా గురించి మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
తమ్మారెడ్డి భరద్వాజ అభిమానులలో తనపై వ్యతిరేకత పెరిగే విధంగా బిహేవ్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోలను, అభిమానులను రెచ్చగొట్టేలా ఆయన కామెంట్లు చేయొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.