దసరాకు రాబోతున్న అతి పెద్ద తెలుగు సినిమా ఇదే

జయం రవి మరియు అరవింద స్వామి లు నటించిన తమిళ సినిమా బోగన్‌ తెలుగు రీమేక్ రైట్స్ ను మూడేళ్ల క్రితం నిర్మాత రామ్ తాలూరి కొనుగోలు చేశాడు.ప్రముఖ హీరోలతో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్న ఆయన కోరిక తీరలేదు.

 Tamil Bogan Movie Release In Telugu Theaters  Lock Down, Coronavirus, Tamil Movi-TeluguStop.com

మల్టీస్టారర్ కథ అవ్వడం వల్ల హీరోల ఎంపిక విషయంలో చాలా చర్చలు జరిగాయి.ఒక హీరోను మామూలు నటుడితో చేయిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అసలు పట్టాలెక్కలేదు.

రీమేక్‌ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ఎలాగూ కొనుగోలు చేసిన ఆయన ఎందుకు వృదా చేయడం అనుకున్నాడో ఏమో గాని ఇటీవల ఆ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేశాడు.శాటిలైట్ మరియు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఈ లోపు థియేటర్ల ఓపెన్‌కు కు సంబంధించి కేంద్రం నుండి మార్గదర్శకాలు వచ్చాయి.అక్టోబర్ 15 నుండి థియేటర్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

డిజిటల్ ప్లాట్ ఫామ్ మరియు శాటిలైట్ ల కంటే ముందు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ 15న లేదా మూడు నాలుగు రోజులు అటూ ఇటుగా సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన బోగన్‌ సినిమా తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

తెలుగులో లాక్‌ డౌన్‌ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా ఇదే అవ్వడంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.అరవిందస్వామి మరియు జయం రవి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.

కనుక ఈ సినిమా థియేటర్లలో ఆడే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube