డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మరింత కఠిన శిక్ష అమలు చేయాలని భావిస్తున్నారా.. ?

మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఉన్న లాభం గురించి అందరికి తెలిసిందే.కానీ ఈ మద్యం ఎందరి జీవితాల్లో చీకట్లను నింపుతుందో ఆలోచించే వారే కరువైయ్యారు.

 Survey Of Traffic Police To Enforce More Severe Punishments In Drunk And Drive C-TeluguStop.com

మద్యాన్ని ప్రోత్సాహిస్తూనే, మందు బాబులకు వాతలు పెడుతున్నారు.

ఇకపోతే కొద్దిరోజుల క్రితం మద్యం తాగి వాహనం నడిపిన ఘటనలో కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందగా మరొక కానిస్టేబులు గాయపడిన విషయం తెలిసిందే.

అయితే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతలా హెచ్చరిస్తున్నా తీరు మారడం లేదు.

ఈ నేపథ్యంలో ఒక యాప్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఇక ఈ సర్వేలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మరింత కఠిన శిక్ష అమలు చేయాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా ఇందుకు అవును అని 81 శాతం మంది, కఠిన శిక్ష వద్దు అని 15 శాతం మంది, ఏమీ చెప్పలేమని మరో 4 శాతం మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట.

ఇక ఇదే ప్రశ్నను ఏపీ ప్రజలను అడగగా కఠిన శిక్షలు అమలు చేయాలని 85 శాతం మంది, వద్దు అని 11 శాతం మంది ఏమీ చెప్పలేమని 4 శాతం మంది వెల్లడించారట.

అదీకాదు గానీ వేళాపాల లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలు తెరచి ఉంటే తాగే వాడికి ఆశపుట్టదా అని అనుకుంటున్నారట కొందరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube