సూప‌ర్ జాబ్‌.. వాటిని ప్యాక్ చేస్తే చాలు ల‌క్ష‌ల్లో జీతం..

కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.

 Super Job Just Pack Vegetables And Get Salary In Lakhs America Company Job Offer-TeluguStop.com

ఒక్క ఉద్యోగం కోసం వేల మంది పోటీ పడుతున్న పరిస్థితులను మనం చూడొచ్చు.అయితే, ఉద్యోగం చేయడం అంత సులభం కాదన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది.

ఎంతో ప్రెషర్‌తో పాటు పై స్థాయి ఉద్యోగులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.వేతనం కూడా అనుకున్నంత ఉండబోదు.

ఈ క్రమంలో హాయిగా ఉండే ఉద్యోగం దొరికితే చాలా బాగుండు అని అనుకుంటు ఉంటారు చాలా మంది.అటువంటి ఉద్యోగం ఒకటి ఉందండోయ్.

పని తక్కువ, వేతనం కూడా చాలా ఎక్కువ.కూరగాయలు కటింగ్ చేయడమే ఉద్యోగం కాగా, అలా చేసినందుకుగాను ఏడాదికి రూ.65 లక్షల వేతనం ఇస్తారట.

క్యాబేజీ ఇతర కూరగాయాల కటింగ్ కోసం అమెరికా కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది.ఇలా కూరగాయలు కట్ చేస్తే ప్రతీ గంటకు 30 డాలర్లు అనగా రూ.2,250 ఇస్తారు.అంటే రోజుకు రూ.18 వేలు కాగా, ఏడాదికి రూ.65 లక్షల వేతనం.ఈ ఉద్యోగం గురించి తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా? అని ప్రశ్నిస్తున్నారు.ఈ ఒక్క ఉద్యోగమే కాదు.ప్రపంచంలో ఇటువంటి వింత ఉద్యోగాలు బోలెడు ఉన్నాయి.అవేంటంటే… నిద్రపోవడమే ఉద్యోగమట.ప్రొఫెషనల్ స్లీపర్స్ అనగా నూతనంగా తయారు చేసిన బెడ్స్‌లో గంటల తరబడి నిద్రపోతే చాలు మీకు లక్షల్లో వేతనం ఇస్తాయి కంపెనీలు, హోటల్స్.

Telugu Per Annum, Americacompany, Cabbage, Pack Vegetables, Salary Lakhs, Job, V

అలా నిద్రపోవడం ద్వారా తమ హోటల్‌లో చక్కటి నిద్రపడుతుందని నిరూపించాలి.ఇకపోతే ఐస్ క్రీమ్ తినడం కూడా ఉద్యోగమే.అయితే, ఇక్కడ ఐస్ క్రీమ్ మేకర్స్ న్యూ ఐస్ క్రీమ్స్ తయారు చేసి వాటిని పరీక్షించేందుకు వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తారు.అలా ఐస్ క్రీమ్‌లు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తే చాలు మీకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఇస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube