టాలీవుడ్లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్, అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్‌గా మారాడు.అయితే ఆ తరువాత హీరోగా మారిన సునీల్ కొన్ని సినిమాల వరకు బాగానే సక్సెస్ అందుకున్నాడు.
కానీ ఆ తరువాత వరుసగా ఫ్లాప్ మూవీలతో ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించాడు.రొటీన్ కథలతో సినిమా అంటేనే భయపడేలా చేశాడు.
దీంతో హీరోగా అతడికి ఛాన్సులు రాకపోవడంతో తిరిగి కమెడియన్‌గా మారాడు.
అయితే ఈసారి అతడి కామెడీలో కూడా పెద్దగా పస లేకపోవడంతో క్యారెక్టర్ పాత్రలు కూడా చేసుకుంటున్నాడు.
ఇలా తన స్టార్‌డమ్‌ను కోల్పోయిన సునీల్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.గతంలో సునీల్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు.కానీ ఇప్పుడు రోజుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇటీవల మాస్‌రాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్‌గా కూడా సునీల్ నటించాడు.
ఇక సునీల్ ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా నటించనున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27వ చిత్రంలో కూడా సునీల్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాలో సునీల్‌కు ఎలాంటి పాత్ర దక్కుతుందో చూడాలి అంటున్నారు అభిమానులు.