ఫైటర్‌ను జవాన్‌గా మారుస్తున్న లెక్కల మాస్టర్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.తాజాగా ఆయన నటిస్తున్న ఫైటర్ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయిన సంగతి తెలిసిందే.

 Sukumar Vijay Devarakonda Movie Background, Sukumar, Vijay Devarakonda, Fighter,-TeluguStop.com

ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ దేవరకొండ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా కోసం సుకుమార్ ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఈ సినిమా కథ ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సాగనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దేశం కోసం పోరాడే జవాన్ పాత్రలో కనిపిస్తాడని, అతడి పాత్ర సినిమాకు మేజర్ అసెట్‌గా మిగలనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా పూర్తి రొమాంటిక్ హీరో ఇమేజ్ నుండి ఈసారి దేశభక్తి ఉన్న జవాన్ పాత్రకు షిఫ్ట్ అవుతున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది చూడాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను ‘పుష్ప’ సినిమా తరువాత తెరకెక్కించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు.కాగా ఫైటర్ చిత్రాన్ని ముగించుకున్న తరువాత ఏడాది పాటు సుకుమార్ కోసం డేట్స్ కేటాయించేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడట.

మరి ఈ సినిమాతో రౌడీ హీరో ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తాడా అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఈ సినిమాను వీలైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు సుకుమార్, విజయ్‌లు రెడీ అవుతుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube